Monday, December 23, 2024

కన్నీటి పర్యంతమైన మంత్రి..

- Advertisement -
- Advertisement -

మహబూబాబాద్ : ఇటీవల గ్రైనెట్ లారీ ప్రమాదంలో మృతి చెందిన, గాయపడ్డ కుటుంబాలను రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ చిన్నగూడూరు మండలంలోని మంగోలిగూడెం గిరిజన తండాలో పరమార్శించారు. ఈ సందర్భంగా వారి దయనీయ పరిస్థితిని చూసి కన్నీటి పర్యంతమైయ్యారు. మృతుల, గాయపడ్డ కుటుంబాలను పరామర్శించి, ఓదారుస్తు వారికి అన్ని విధాలుగా అండగా నిలుస్తామంటూ ధైర్యం చెప్పారు. మృతుల కుటుంబాలకు రూ. పది వేలు, గాయపడ్డ వారి కుటుంబాలకు రూ. ఐదు వేలు వ్యక్తి గతంగా ఆర్థిక సాయం అందజేశారు మంత్రి. ఇంకా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితులను కూడా వైద్యులకు ఆమె ఫోన్ చేసి అడిగి తెలుసుకున్నారు. వారికి మెరుగైన వైద్యాన్ని అందించాలని కూడా వారిని ఆదేశించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ రోడ్డు ప్రమాదం అత్యంత దురదృష్టకరం అని పేర్కోన్నారు. యుక్త వయస్సు వారే ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందడం, పలువురు గాయపడడం దారుణమని చెప్పారు. ఈ మేరకు సిఎం కెసిఆర్ దృష్టికి ఈ ప్రమాద వషయం తీసుకెళ్లి ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని వెల్లడించారు. మృతుడు సుమన్‌కు రైతు భీమాను వర్తింప చేయడంతో పాటు మిగతా ఇరువురు మృతుల కుటుంబాలకు ఆపద్బంధు పథకం ద్వారా ఆర్ధిక సాయం అందిస్తామని ప్రకటించారు. ప్రమాదానికి కారకులైన లారీ డ్రైవర్, లారీ యజమాని, రాళ్లు కొనుగోలు చేసిన వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు మంత్రి వివరించారు. వారి తరుపున ఎక్కువ నష్ట పరహారాన్ని బాధితులకు అందించే ప్రయత్నం కూడా చేస్తామని చెప్పారు.

మంత్రి వెంట చిన్నగూడూరు ఎంపీపీ వల్లూరి పద్మవెంకట్‌రెడ్డి, సర్పంచ్ నరేష్, కురవి జెడ్పీటీసీ బండి వెంకట్‌రెడ్డి, బిఆర్‌ఎస్ నాయకులు కొంపెల్లి శ్రీనివాస్‌రెడ్డి, వల్లూరి కృష్ణారెడ్డి, నూకల వేణుగోపాల్‌రెడ్డి, కొంపెల్లి వేణుగోపాల్‌రెడ్డి, మోహన్, అండెం ఉప్పల్ రెడ్డి, ఎస్. శ్రీను, బొమ్మకంటి వెంకట్‌గౌడ్, అదనపు కలెక్టర్ ఎం. డేవిడ్, తహసిల్దార్ ఇమ్మన్యుయల్ తదితరలు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News