Sunday, December 22, 2024

జార్ఖండ్ మంత్రికి కులబహిష్కరణ హెచ్చరిక

- Advertisement -
- Advertisement -

రాంచి: జార్ఖండ్ మంత్రి ఒకరిపై కుల బహిష్కరణ ఎవేటు పడింది. మంత్రి సత్యానంద భోక్త, ఆయన కుటుంబాన్ని కుల బహిష్కరణ చేస్తున్నట్లు ఒక కుల సంఘం బుధవారం ప్రకటించింది. భోక్త కుమారుడు వేరే కులం అమ్మాయిని వివాహం చేసుకున్నందుకు భోక్త కుటుంబాన్ని బహిష్కరిస్తున్నట్లు ఖర్వర్ భోక్త మసాజ్ వికాస్ సంఘ్ ప్రకటించినట్లు వర్గాలు తెలిపాయి.
అయితే..ఈ ప్రకటనను హాస్యాస్పదమంటూ భోక్త కొట్టివేశారు. తనను, తన కుటుంబాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించిన వారే సమాజం నుంచి బహిష్కరణకు గురవుతారని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రీయ జనతా దళ్(ఆర్‌జెడి) ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రి పదవిలో ఉన్న భోక్త ఛత్ర నివాసి.

జార్ఖండ్ ప్రభుత్వంలో ఆయన ప్రణాళిక, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నారు. భోక్త కుమారుడు ముఖేష్ వివాహం డిసెంబర్ 8జరగనున్నది. అయితే..ఈ కులాంతర వివాహాన్ని వ్యతిరేకిస్తున్న ఖర్వర్ భోక్త వికాస్ సంఘ్ బుధవారం సమావేశమై తమ కుల సాంప్రదాయాలను ఈ పెళ్లి నాశనం చేయనుందని తీర్మానించింది. మంత్రి భోక్త కుటుంబంతో తమ కులస్తులెవరూ ఎటువంటి సంబంధాలు పెట్టుకోరాని పిలుపునిస్తూ సంఘ్ కేంద్ర అధ్యక్షుడినని తనకు తాను చెప్పుకుంటున్న దర్శన్ గంఝు ఒక లిఖితపూర్వక ప్రకటన విడుదల చేశారు. మంత్రి భోక్త ఇంట్లో జరిగే ఈ వివాహంలో కాని, ఇతర కుటుంబ కార్యక్రమాలలో కాని తమ కులస్తులెవరూ పాల్గొనరాదని ఆయన పిలుపునిచ్చారు. ఈ ఆదేశాలను ఉల్లంఘించే వారిని కూడా సమాజం నుంచి బహిస్కరిస్తామని ఆయన హెచ్చరించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News