ములుగు : రాజకీయ లబ్ధి కోసమే బిజెపి పేపర్ లీకేజీల వంటి దుర్మార్గాలకు పాల్పడుతుందని రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్రస్థాయిల ధ్వజమెత్తారు. బుధవారం ఆమె మాట్లాడుతూ.. దేశంలోనే ఆదర్శవంతమైన పాలన అందిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలని, బిజెపి అగ్రనాయకత్వం ఇలాంటి కుట్రలకు పాల్పడుతుందని విమర్శించారు. ప్రశ్న పత్రాలు లీకేజీలో రాజకీయాల పార్టీ పాత్ర ఉండటం దురదృష్టకరమని అన్నారు. తప్పు చేసి అడ్డంగా దొరికినా కూడా బిజెపి నాయకులు బండిని సమర్థించడం సిగ్గుచేటని మంత్రి అన్నారు. ప్రభుత్వాన్ని ప్రతిష్ట పాలు చేయాలని బండి కంకణం కట్టుకున్నాడనే విషయం స్పష్టమైంది.
హిందీ పేపర్ లీక్ చేసిన బిజెపి నాయకుడు ప్రశాంత్ వెంటనే ఆ పార్టీ అధ్యక్షునికి పంపించడం, అంతే కాకుండా మీడియాకు సమాచారం అందించడం బిజెపి కుట్రలో భాగమే అని అన్నారు. నిజంగా పేపర్ లీక్ అయి ఉంటే పోలీసులకు సమాచారం అందించి చర్యలు తీసుకోవాలి. కానీ బిజెపి నాయకుడు ఆ పార్టీ అధ్యక్షునికి పంపించి ఆయన పేపర్ లీక్ అయిందంటూ మీడియా వాళ్లకు సమాచారం అందించి రాద్ధాంతం చేశారంటే దాని వెనుక ఉన్న కుట్రను అర్థం చేసుకోవాలి. టిఎస్ పీఎస్సి పేపర్ లీకేజ్ చేసిన నిందితుడు కూడా బిజెపి కార్యకర్తనే ఇప్పుడు పదవ తరగతి పేపర్ లీక్ పేరిట బిజెపి నాయకులు ప్రభుత్వానికి చెడు పేరు తీసుకురావాలని, చేస్తున్న బిజెపి దుర్మార్గపు చర్యలు రెడ్ హ్యాండెడ్ గా బయటపడ్డాయని అన్నారు.