Thursday, January 23, 2025

బిజెపికి ప్రేమంతా ఎన్నికలు, అధికారంపైనే: మంత్రి సత్యవతి రాథోడ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: దేశవ్యాప్తంగా కేంద్రం గిరిజనులకు కేటాయించిన బడ్జెట్ కన్నా…తెలంగాణ ప్రభుత్వం ఎక్కువ నిధులు కేటాయించిందని రాష్ట్ర గిరిజన స్త్రీ -శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో మంత్రి సత్యవతి రాథోడ్, విప్ రేగా కాంతారావు, ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, హరిప్రియ నాయక్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… బిజెపికి ప్రేమంతా ఎన్నికలు, అధికారంపైనే పేద ప్రజలపై లేదని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి గొంతుపెంచి మాట్లాడితే అబద్ధం నిజం కాదు. రేవంత్ రెడ్డికి సోయిఉంటే, చేతనైతే కేంద్రంపై పోరాటం చేయాలని సూచించారు. మేడారం జాతరకు బిఆర్ఎస్ నాలుగేళ్ళ పాటు ఇచ్చిన నిదులు…కాంగ్రెస్ జీవితకాలంలో ఇవ్వలేదన్నారు.

బిఆర్ఎస్ ను పాతాళంలోకి తొక్కడం కాదు.. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పాతాళంలోకి పోకుండా చూసుకోవాలని హెచ్చరించారు. సమయం వచ్చినప్పుడు గిరిజన బంధు ఇస్తామన్నారు. సీఎం కేసీఆర్ కు గిరిజనులంటే ఇష్టమని తెలిపారు. పోడు భూములు త్వరలోనే పంపిణీ చేస్తామని చెప్పారు. కేంద్రం గిరిజనుల పట్ల అక్కసు కక్కడం మానుకోవడం లేదు. పార్లమెంట్ సాక్షిగా మళ్ళీ అబద్ధాలు ప్రకటించారని మండిపడ్డారు. గిరిజన యూనివర్సిటీ ప్రతిపాదన అందలేదని పార్లమెంట్ లో కేంద్రమంత్రి ప్రకటన ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు.

గిరిజన యూనివర్సిటీ అనేది విభజన చట్టంలోనే ఉంది. గిరిజన యూనివర్సిటీ కోసం నోడల్ ఏజెన్సీగా సెంట్రల్ యూనివర్సిటీని నియమించిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. 2017లోనే ములుగు జిల్లా దగ్గర 170 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. HRD ద్వారా కేంద్రానికి భూమి ఉందని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి. 2012,22లో పార్లమెంట్ సెషన్స్ లో రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగినప్పుడు కేంద్రం దగ్గరే ప్రతిపాదనలు ఉన్నాయని కేంద్రం ప్రకటించింది.

తెలంగాణకు యూనివర్సిటీ రాకుండా బీజేపీ కక్షకట్టిందని ఆరోపించారు. నిన్న ధర్మేంద్ర ప్రధాన్ చేసిన ప్రకటన వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ సాక్షిగా కేంద్రమంత్రి అసత్య ప్రకటన చేసినందుకు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. పార్లమెంట్ ను తప్పుదారి పట్టేలా సీనియర్ కేంద్రమంత్రి తప్పుడు ప్రకటన చేయడం ఏంటి? కేంద్ర బీజేపీకి కేసీఆర్ పై కోపమా? తెలంగాణ ప్రజలపై కోపమా? బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి జాతీయస్థాయిలో ఏమైనా పోటీ వస్తదని అబద్ధపు ప్రకటన చేశారా? అని ప్రశ్నించారు. కేంద్రప్రభుత్వం గిరిజనుల పట్ల నిర్లక్ష్యం వహిస్తోంది. గిరిజన యూనివర్సిటీ పై స్పష్టమైన ప్రకటన ఇవ్వాలని మంత్రి సత్యవతి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News