Wednesday, January 22, 2025

బిఆర్‌ఎస్ సర్కార్ చొరవతో మహిళ బిల్లుకు మోక్షం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపి, పార్లమెంట్‌లో ప్రవేశపెట్టడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్సీ కవితను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా రాష్ట్ర మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సిఎం కెసిఆర్ ఎమ్మెల్సీ కవిత బీఆర్‌ఎస్ సర్కారు చొరవ కారణంగానే బిల్లుకు మోక్షం లభించిందని అన్నారు.

ఈ బిల్లు ద్వారా చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలవుతాయని చెప్పారు. మహిళలకు సమాన హక్కులు కల్పించేందుకు బీఆర్ ఎస్ అలుపెరుగని పోరాట ఫలితమే పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టడమేనని పేర్కొన్నారు. బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపితే ఆకాశంలో సగం, భూమిలో సగం, అధికారంలో సగం అనే నినాదం అమలుకానుందన్నారు. రెండు దశాబ్దాలకు పైగా పెండింగ్‌లో ఉన్న బిల్లును ప్రవేశపెట్టడం సంతోషంగా వుందన్నారు. ఈ బిల్లుతో మహిళలు కూడా రాజకీయ రంగంలో ముందు ఉంటారని, దేశ అభివృద్ధిలో తమ వంతు పాత్రను పోషిస్తారని పేర్కొన్నారు. మహిళా బిల్లు కేబినెట్‌లో ఆమోదం పొందడం దేశానికే గర్వకారణమని తెలిపారు.ఈకార్యక్రమంలో తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News