Thursday, January 23, 2025

మంత్రి సత్యవతి రాథోడ్ తప్పిన ప్రమాదం

- Advertisement -
- Advertisement -

Minister satyavathi rathod convoy accident in Mahabubabad

హైదరాబాద్: తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కాన్వాయ్ లోని రెండు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటన మహబూబాబాద్ మరిపేడలో గురువారం చోటుచేసుకుంది. సత్యవతి రాథోడ్ హైదరాబాద్ నుంచి మహబూబాబాద్ వెళ్తున్నారు. ఈ క్రమంలో మరిపెడ కార్గిల్ సెంటర్ లో సమీపంలోకి రాగానే కాన్వాయ్ కి పంది అడ్డువచ్చింది. ఒక్కసారిగా డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. దీంతో వెనుక వస్తున్న వాహనం వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గన్ మెన్ లకు స్వల్పగాయాలు కాగా, మంత్రి సత్యవతి సురక్షితంగా మహబూబాబాద్ కు చేరుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వాహనాలను క్లియర్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News