- Advertisement -
మహబూబాబాద్ : తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ కు మాతృవియోగం కలిగింది. హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె తల్లి గుగులోతు దస్మి(80)మృతి చెందారు. ఇటీవలే మంత్రి సత్యవతిరాథోడ్ తండ్రిని కోల్పోయారు. ఆ విషాదం నుండి తేరుకొక ముందే తల్లి మృతి వారి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. శనివారం ఉదయం మంత్రి సత్యవతి స్వగ్రామం కురవిమండలం పెద్దతండాలో గుగులోతుదస్మి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆమె మృతిపట్ల పలువురు నాయకులు సంతాపం ప్రకటించారు.
- Advertisement -