Monday, December 23, 2024

వర్షాల నేపథ్యంలో సహాయక చర్యలు చేపట్టాలి

- Advertisement -
- Advertisement -

Minister Satyavathi Rathod Review On Rains

కలెక్టర్లకు మంత్రి సత్యవతి రాథోడ్ ఆదేశం

హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండరా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అధికారులను అప్రమత్తం చేయాలని, అవసరమైన చోట సహాయక చర్యలు చేపట్టాలని గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి జిల్లా కలెక్టర్లతో మంత్రి శనివారం టెలిఫోన్ ద్వారా సమీక్ష నిర్వహించారు. అక్కడి పరిస్తితులను అడిగి తెలుసుకున్నారు. వర్షాల వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. భారీ వానలు, వరదల నేపథ్యంలో అనవసరంగా రిస్కు తీసుకోవద్దని, అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు వెళ్ళకుండా ఉండాలని, తగు స్వీయ జాగ్రత్తలు పాటించాలని ఆయా జిల్లాల ప్రజలకు మంత్రి సత్యవతి రాథోడ్ విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News