- Advertisement -
హైదరాబాద్: ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రసంగం సందర్భంగా ఐకేపీ, మెప్మా, మధ్యాహ్న భోజన కార్మికుల వేతనాలు పెంచడం, ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకోవడం పట్ల ఎక్కువ మంది మహిళల లబ్ది పొందనున్నారని, మహిళల పక్షాన రాష్ట్ర గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఈ సందర్భంగా ఆమె సిఎం కేసిఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ మహిళా బంధు అని ఈ వేతనాల పెంపు, విధుల్లోకి తీసుకోవడంతో మరోసారి నిరూపితమైందన్నారు. సిఎం కెసిఆర్ వచ్చాకే తెలంగాణలో మహిళలకు గుర్తింపు, గౌరవం లభించింది మంత్రి సత్యవతి పేర్కొన్నారు
- Advertisement -