Thursday, January 23, 2025

రేపు కాటారంకు మంత్రి సత్యవతి రాథోడ్ రాక

- Advertisement -
- Advertisement -

కాటారం : రేపు కాటారం మండలంలో పోడు భూములకు పట్టాదారు పాస్తుపుస్తకాలు పంపిణీ చేసేందుకు గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ వస్తున్నట్లు కాటారం మండల పరిషత్ అభివృద్ది అధికారి మాలోత్ శంకర్‌నాయక్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మంథని నియోజకవర్గం పరిధిలోని కాటారం, మహాముత్తారం, మల్హార్, మహాదేవపూర్, పలిమెల మండలాలకు చెందిన లబ్ధిదారులకు మద్దులపల్లి గ్రామపంచాయితీ పరిధిలోని ఎల్.జి.గార్డెన్‌లో పట్టా పాసుపుస్తకాలు మంత్రి చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు, జెడ్పీ చైర్‌పర్సన్ జక్కు శ్రీహర్షిణీరాకేష్, ఆయా మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీలు, అధికారులు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News