ములుగు : ములుగు జిల్లాలో మంత్రి సత్యవతి రాథోడ్ జడ్పి చైర్‌పర్సన్ బడే నాగజ్యోతి, రెడ్ చైర్మన్ వై. సతీష్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పోరిక గోవింద్‌నాయక్‌లతో కలిసి సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా వరద ప్రభావిత ప్రాంతాలు మల్లకట్ట, రామన్నగూడెంలో పర్యటించారు. అధికారులు, ప్రజలకు అందుబాటులో ఉంటూ యుద్ధ్ద ప్రాతిపదికన తదుపరి చర్యలకు శ్రీకారం చుట్టారని ఆదేశించారు. ఊరట్టం, కన్నెపల్లి, కాల్వపల్లి, గ్రామాలలో శుక్రవారం రాత్రి పర్యటించి ప్రజలను కలిసి వరద నష్టం గురించి తెలుసుకున్నారు.
గామానికి వెళ్ళడానికి అప్పటికి రోడ్లు బురదతో నిండి ఉండడంతో ట్రాక్టర్‌పై వెళ్ళి ప్రజల బాగోగులు కనుక్కున్నారు. పునరావాస కేంద్రాలను పరిశీలించి వారికి అందుతున్న సౌకర్యాలను గురించి అడిగి కనుక్కున్నారు. పునరావాస కేంద్రాలలో ప్రజలకు అసౌకర్యాలు కలగకుండా ప్రతినిత్యం పర్యవేక్షించాలని సర్పంచ్‌లకు సూచనలు చేశారు. త్వరితగతిన గ్రామాలలో పరిస్థితులు మెరుగుపడేలా అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వారికి హామీ ఇచ్చారు.