Monday, January 20, 2025

సమ్మక్క- సారలమ్మను దర్శించుకున్న మంత్రి సత్యవతి రాథోడ్‌

- Advertisement -
- Advertisement -

ములుగు:  ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం దొడ్ల గ్రామంలో రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమశాఖల మంత్రి సత్యవతి రాథోడ్ సారలమ్మ తల్లిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కొండాయి గ్రామంలో గోవిందరాజుల స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం కొండాయి, శ్రీ సమ్మక్క, సారలమ్మ మినీ జాతర అభివృద్ధి పనులకు రూ. 50లక్షల 85వేలతో శంకుస్థాపన చేశారు.

కొండాయి గ్రామంలో మినీ మేడారం సమ్మక్క సారలమ్మను దర్శించుకొని పూజలు చేశారు. కొండాయి గ్రామంలో గోవిందరాజుల జాతరలో ఉచిత వైద్య శిభిరాన్ని మంత్రి సత్యవతి రాథోడ్ ప్రారంభించారు. అనంతరం అక్కడ స్థానిక ప్రజలను మంత్రి కలిసారు. వారితో మమేకమై నేలపై కూర్చుని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. త్వరలో అక్కడికి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం షెడ్లు ఏర్పాటు చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. స్థానిక సమస్యల పరిష్కార దిశగా కృషి చేస్తానని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News