Sunday, December 22, 2024

మునుగోడును మరింత అభివృద్ధి చేస్తాం: మంత్రి సత్యవతి రాథోడ్

- Advertisement -
- Advertisement -

యాదాద్రి: మునుగోడులో జరిగిన ఉపఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ విజయం ద్వారా మునుగోడు నియోజకవర్గ ప్రజలు టీఆర్ఎస్‌పై తమకున్న అభిమానాన్ని చాటారని మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించినందుకు మునుగోడు ఓటర్లకు టిఆర్ఎస్ పార్టీ తరుపున ఎప్పటికీ రుణపడి ఉంటామని ఈసందర్భంగా మంత్రి సత్యావతి రాథోడ్ చెప్పారు. సోమవారం కుటుంబ సభ్యులతో కలిసి యాదాద్రి శ్రీ లక్ష్మీనారసింహ స్వామివారిని మంత్రి సత్యవతి రాథోడ్ దర్శించుకున్నారు. అనంతరం విలేకరులతో మంత్రి సత్యావతి రాథోడ్ మాట్లాడుతూ.. మంత్రి కెటిఆర్ ఇచ్చిన హామీ మేరకు మూడున్నరేండ్లలో అభివృద్ధికి నోచుకోని మునుగోడు నియోజకవర్గాన్ని అద్భుతంగా తీర్చిదిద్దేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. దొంగ ప్రమాణాలు చేసిన బిజెపి నాయకులకు లక్ష్మీనరసింహ స్వామి తగిన బుద్ధి చెప్పారని వెల్లడించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ చూపిన సంకల్పంతో దేశంలో అన్ని రాష్ట్రాలలో గొప్ప అభివృద్ధిని తీసుకురావడం ఖాయమన్నారు. కెసిఆర్‌తోనే దేశంలో గిరిజనులు, దళితులు, రైతులు, మహిళలు సుభిక్షంగా ఉంటారని మంత్రి సత్యావతి రాథోడ్ స్పష్టం చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పార్టీని ఆదరించిన ప్రజలందరికీ మంత్రి సత్యవతి రాథోడ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News