Wednesday, January 8, 2025

మెడికో విద్యార్థిని పరామర్శించిన మంత్రి సత్యవతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పిజి వైద్య విద్యార్థిని ప్రీతిని గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ శుక్రవారం పరామర్శించారు. ఆమె ఆరోగ్యపరిస్తితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ప్రీతికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని వైద్యులను ఆదేశించారు. ప్రీతి తల్లిదండ్రులతో మాట్లాడి వారిని ఓదార్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాకతీయ మెడికల్ కాలేజీ పిజి విద్యార్థిని ధరావత్ ప్రీతి ఆత్మహత్యాయత్నం సంఘటన చాలా బాధకరమని అన్నారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ చేపడుతోందన్నారు. నిందితులు ఎంతటివారైనా వదిలిపెట్టది లేదని, వారిపై కఠినచర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి కెసిఆర్ వరంగల్ కమిషనర్‌కు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. వైద్యులతో గంట గంటకు మంత్రి హరీశ్‌రావు స్వయంగా మాట్లాడుతూ ప్రీతి ఆరోగ్య పరిస్థితి గురించి పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ప్రీతికి మెరుగైన వైద్యం అందించేలా ముఖ్యమంత్రి కెసిఆర్ నిమ్స్ డైరెక్టర్‌ను, వైద్య బృందాన్ని ఆదేశించారని తెలిపారు. ప్రీతికి ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స అందిస్తున్నారని, ప్రస్తుతానికి వెంటిలేటర్, ఏఖ్మో మీద ఉన్నారని, సిఆర్‌ఆర్‌టి డయాలసిస్ ద్వారా చికిత్స అందిస్తున్నారని తెలిపారు.

ఆమె తల్లిదండ్రులతో కలిసి వెళ్ళినపుడు వారి మాటలకు ప్రీతి కళ్ళు తెరిచి చూడగలుగుతుందని, స్వతాహాగా ఊపిరి తీసుకోగల్గుతుందని మంత్రి వెల్లడించారు. ప్రీతి ఆరోగ్యంగా కోలుకొని క్షేమంగా బయటకు రావాలని ప్రార్థించారు. ప్రీతి కుటుంబానికి అన్ని విధాల ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News