Saturday, November 16, 2024

సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ చేసిన మంత్రి సత్యవతి

- Advertisement -
- Advertisement -

మహబూబాబాద్: ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చిందని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. శనివారం మహబూబాబాద్‌లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో పలువురు అబ్ధిదారులకు సిఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరైన చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పేద, మధ్య తరగతి ప్రజలకు ఆపత్కాలంలో సిఎం రిలీఫ్ ఫండ్ వరంలా మారిందని, ప్రజల ఆరోగ్యానికి తెలంగాణ ప్రభుత్వం భరోసా కల్పిస్తుందన్నారు. సిఎం కెసిఆర్ పేదల ఆరోగ్య పట్ల ప్రత్యేక శ్రద్ధను చూపుతున్నారని తెలిపారు. నియోజకవర్గంలో ఇప్పటికే కోట్లాది రూపాయాలను సిఎం సహాయ నిధి నుంచి అందివ్వడం జరిగిందన్నారు.

ఇకపై కూడా ఎక్కువ మొత్తంలో అందిస్తామని తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేదలు స్ధానిక నాయకుల ద్వారా మా దృష్టికి తీసుకువస్తే వారికి అండగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో జడ్‌పి చైర్‌పర్సన్ కుమారి ఆంగోతు బిందు, బిఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకల నరేష్‌రెడ్డి, కురవి జడ్‌పిటిసి బండి వెంకట్‌రెడ్డి బయ్యారం పిఏసిఎస్ చైర్మన్ మూల మధుకర్‌రెడ్డి, బిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు కొంపెల్లి శ్రీనివాస్‌రెడ్డి, గుగులోతు శ్రీరాం నాయక్, బోడ శ్రీను, హనుమ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News