Friday, January 24, 2025

మంత్రి సత్యవతి రాథోడ్‌కు మరోసారి దక్కిన గౌరవం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్ర పర్యటన నేపథ్యంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌కు మరోసారి మినిస్టర్ ఇన్ వేటింగ్‌గా బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది కోసం ఐదు రోజుల పర్యటనను సిఎం కేసీఆర్ ఆదేశాలతో మంత్రి సత్యవతి రాథోడ్ దగ్గరుండి పర్యటన విజయవంతం చేశారు. ఈ నేపథ్యంలో మరోసారి రాష్ట్ర ప్రభుత్వం మంత్రి సత్యవతి రాథోడ్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన బాధ్యత ఇచ్చింది. శుక్రవారం రాష్ట్ర పర్యటనకు ద్రౌపది ముర్ము బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌తో కలసి మంత్రి సత్యవతి రాథోడ్ రాష్ట్రపతికి ఘనస్వాగతం పలికారు.

నేడు దుండిగల్‌లోని ఎయిర్ ఫోర్స్ అకాడమీలో జరిగే కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ (సీజీపీ) కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరవుతారు. పరేడ్ శిక్షణలో ప్రతిభ చూపిన క్యాడెట్లకు రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము అవార్డులు అందజేయనున్నారు.ఈ కార్యక్రమాలను సైతం మంత్రి సత్యవతి రాథోడ్ గారు ఏలాంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని బాధ్యతలు తీసుకొని ఏర్పాట్లు చేయనున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News