Tuesday, December 24, 2024

పౌర్ణమి జీవితంలో వెలుగులు నింపిన మంత్రి సత్యవతి రాథోడ్

- Advertisement -
- Advertisement -
  • పోలియో బారిన పడిన చిన్నారికి ఆర్ధ్థిక చేయూత
  • రూ.80 వేల ఎలక్ట్రికల్ వీల్ చైర్ అందజేత

ములుగు జిల్లా ప్రతినిధి : పుట్టుకతోనే పోలియో బారిన పడిన చిన్నారి పౌర్ణమికి రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అండగా నిలిచారు. జిల్లాలోని గోవిందరావు పేట మండలం చల్వాయి గ్రామానికి చెందిన పౌర్ణమి ఐదేళ్ల వయసులో ఉండగానే తల్లి కన్ను మూసింది. తండ్రి తన బాధ్యత మరిచాడు దీంతో పదమూడెళ్ల పౌర్ణమి నానమ్మతో పాటు ఉంటూ తన సోదరి జ్యోతి సహాయంతో విరిగిపోయిన చక్రాల కుర్చిలో పాఠశాలకు వెళ్తుంది.

ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమశాఖల మంత్రి సత్యవతి రాథోడ్ బుధవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ సమావేశ మందిరం ఆవరణలో పౌర్ణమికి రూ. 80 వేల తో ఎలక్ట్రికల్ వీల్ చైర్ ను అందించి, అందులో కూర్చో బెట్టారు. సోదరి జ్యోతి సహాయం లేకుండానే ఇప్పుడు స్వయంగా పౌర్ణమి స్వతహాగా వెళ్లేందుకు చైర్ పనిచేస్తుందని ఇప్పుడు ఇద్దరికి కష్టాలు ఉండవని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.

అనంతరం మంత్రి చిన్నారులతో కాసేపు ముచ్చటించి వికలాంగుల పెన్షన్ ను పునరుద్దరించారు. పౌర్ణమి కష్టం తెలుసుకుని ఒక్కరోజులోనే సమస్య పరిష్కరించి తమకు అండగా నిలిచారని అంటూ ఆనందం వ్యక్తం చేస్తూ మంత్రికి చిన్నారి కుటుంబ సభ్యులు, స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ ఎంపి మాలోత్ కవిత, జడ్పీ చైర్మన్ బడే నాగజ్యోతి, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, రెడ్కో చైర్మన్ వై సతీష్ రెడ్డి, ఐటిడిఏ పిఓ అంకిత్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పోరిక గోవింద్ నాయక్, ములుగు ఎంపిపి గండ్రకోట శ్రీదేవి సుధీర్, వెంకటాపూర్ జడ్పీటీసి గై రుద్రమదేవి, ములుగు, వెంకటాపూర్ బిఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బాధం ప్రవీణ్, లింగాల రమాణారెడ్డిలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News