న్యూఢిల్లీ : మద్యం పాలసీ కేసులో అరెస్టై తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను ఆ పార్టీ ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ బుధవారం కలుసుకున్నారు. అనంతరం భరద్వాజ్ మీడియాతో మాట్లాడుతూ “ములాకత్ జంగ్లాలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను కలుసుకున్నాను. ఫోన్‌ద్వారా ఇద్దరం మాట్లాడుకున్నాం. తన గురించి ప్రజలు ఆందోళన చెందవద్దని కేజ్రీవాల్ చెప్పారు. తాను ఆరోగ్యంగా బలంగానే ఉన్నాను.
ఢిల్లీ ప్రజల ఆశీర్వాదాలతో కేజ్రీవాల్ పోరాటం కొనసాగిస్తానని చెప్పారు ” అని సౌరభ్ వివరించారు. ములాకత్ జంగ్లాలో మా ఇద్దరి మధ్య గ్రిల్, అద్దం ఉంది. మరోవైపు సిఎం కేజ్రీవాల్ కూర్చున్నారుఅని భరద్వాజ్ తెలియజేశారు. మనీల్యాండరింగ్ కేసు కింద కేజ్రీవాల్ మార్చి 21న అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అంతకు ముందు ఏప్రిల్ 15న పంజాబ్ సిఎం భగవంత్ మాన్, ఆప్ జాతీయ ప్రధాన కార్యదర్శి సందీప్ పాథక్ తీహార్ జైలులో కేజ్రీవాల్‌ను కలుసుకున్నారు.