Wednesday, December 25, 2024

కేంద్ర బడ్జెట్‌పై కెసిఆర్ ఎందుకు స్పందించలేదుః మంత్రి సీతక్క

- Advertisement -
- Advertisement -

కేంద్ర బడ్జెట్ పై స్పందించని కెసిఆర్, రాష్ట్ర బడ్జెట్ మీద మాట్లాడటం విడ్డూరంగా ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అనసూయ సీతక్క అన్నారు. తెలంగాణకు ద్రోహం చేసిన కేంద్ర బడ్జెట్ ను నిరసిస్తూ అసెంబ్లీ తీర్మానం చేస్తే కెసిఆర్ ఎoదుకు రాలేదని నిలదీశారు. కేంద్ర బడ్జెట్ పై మాట్లాడని కెసిఆర్, రాష్ట్ర బడ్జెట్ ను విమర్శించడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని పేర్కొన్నారు. బిజెపితో ఒప్పందంలో భాగంగానే అసెంబ్లీకి వచ్చిన మొదటి రోజే రాష్ట్ర ప్రభుత్వాన్ని కెసిఆర్ టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు బిజెపి మెప్పుకోసమే కెసిఆర్ రాష్ట్ర బడ్జెట్‌ను విమర్శించారని అన్నారు. ఆరు నెలల తర్వాత అసెంబ్లీ సమావేశాలకు రావడమే అందుకు నిదర్శనమని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News