Sunday, December 22, 2024

కెటిఆర్ ట్వీట్‌కు మంత్రి సీతక్క కౌంటర్

- Advertisement -
- Advertisement -

కెటిఆర్ తీరు హంతకులే సంతాపం పలికినట్టు ఉందని మంత్రి సీతక్క విమర్శించారు. బిఆర్‌ఎస్ హయంలో పంచాయతీలకు నిధులు, సర్పంచ్‌లకు బిల్లులు ఏళ్ల తరబడి చెల్లింపులకు నోచుకోలేదని పేర్కొన్నారు. అన్ని శాఖల్లో కలిసి రూ.72 వేల కోట్ల పెండింగ్ బిల్లులను వారసత్వంగా వదిలిపోయారని, ఆ పాపాన్ని ఇప్పుడు తమ ప్రభుత్వం మోయాల్సి వస్తుందని అన్నారు. మీ అస్థవ్యవస్థ పాలనతో పల్లెలను నిర్లక్షం చేసి ఊపర్ షేర్వాణి, అందర్ పరేషాని లాగా మార్చారని కెటిఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. బిఆర్‌ఎస్ ఏలుబడిలో తెలంగాణలో విజృంభిస్తున్న విష జ్వరాలు,పడకేస్తున్న ఏజెన్సీ పల్లెలు, ఆస్పత్రికి క్యూ కడుతున్న జనం,

విష జ్వరాలతో ప్రభుత్వ ఆసుపత్రులు కిటకిట, ఏజెన్సీ పల్లెలను హడలెత్తిస్తున్న జ్వరాలు, ఏజెన్సీలో హెల్త్ క్యాంపులు, వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో జ్వర బాధితుల కోసం ప్రత్యేక వార్డు ఏర్పాటు, విష జ్వరాలతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో నెలరోజుల వ్యవధిలో 42 మంది మృతి వంటి కథనాలు పత్రికల్లో వందల సంఖ్యలో వచ్చినా మీరు ఏనాడు పట్టించుకున్న పాపాన పోలేదని పేర్కొన్నారు. మీ పాలనలో ఊర్లకు ఊర్లే విషజ్వరాల బారిన పడిన సంగతిని మర్చిపోయారా..? అని కెటిఆర్‌ను ప్రశ్నించారు. తాము చేపట్టిన చర్యల వల్ల ఇప్పుడు అటువంటి పరిస్ధితులు లేవు అని, ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో సాధారణంగా నమోదు అయ్యే కేసులు గతంతో పోలిస్తే పెరగలేదని చెప్పారు. పారిశుధ్య, డ్రైనేజీ నిర్వహణ, దోమల మందుకు, బ్లీచింగ్ పౌడర్‌కు ఎక్కడా నిధుల కొరత లేదని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News