Sunday, December 22, 2024

బిఆర్‌ఎస్ పాలనలో మహిళలపై 1,57,610 నేరాలు:మంత్రి సీతక్క

- Advertisement -
- Advertisement -

బిఆర్‌ఎస్ పాలన ప్రారంభమైన 2014 నుంచి 2022 వరకు మహిళలపై 1,57,610 నేరాలు జరిగాయని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. 2021లో అయితే అధికంగా 20,865 నేరాలు జరిగాయని తెలిపారు. మహిళలపై నేరాల గురించి కెటిఆర్ చేసిన వ్యాఖ్యలు, మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళతామని చెప్పడంపై మంత్రి సీతక్క స్పందించారు. ఆదివారం సిఎల్‌పి సమావేశం జరుగుతున్న నానక్ రాంగూడ షేర్టాన్ హోటల్ వద్ద మీడియా తో మాట్లాడుతూ మంత్రి సీతక్క కెటీఆర్‌కి గట్టి కౌంటర్ ఇచ్చారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో 2014 నుంచి 2023 వరకు రాష్ట్రంలో మహిళల పై జరిగిన దాడుల గురించి కూడా మహిళా కమిషన్‌కు కేటీఆర్ ఫిర్యాదు చేస్తే బాగుంటుందని అన్నారు. 2014. -23 మధ్య మహిళలపై రాష్ట్రంలో జరిగిన క్రైం డేటా మొత్తం తన దగ్గర ఉందని తెలిపారు. జాతీయ నేర గణాంకాల నివేదికను కెటిఆర్ చూడాలని అన్నారు.

ఒక వేళ కావాలంటే తన వద్ద ఉన్న డేటాను కేటీఆర్‌కు ఇస్తానని అన్నారు. ఈ డేటాను మంత్రి మీడియాకు విడుదల చేశారు. ఆ నివేదికలో ప్రతి ఏటా తెలంగాణలో మహిళల మీద నేరాలు పెరిగినట్లు లెక్కలు చెబుతున్నాయని అన్నారు. -2014 లో 14,417, -2015లో 15425, 2016లో 15,374, -2017లో 17,521, -2018లో 16,027, -2019లో 18,394, -2020లో 17,791, -2021లో 20,865, -2022లో 22,066 కేసులు మహిళలపై జరిగిన నేరాలు, ఘోరాలు, అఘాయిత్యాలకు సంబంధించి నమోదు అయ్యాయని మంత్రి వివరించారు. మహిళా కమిషన్‌ను తాము కూడా కలుస్తామని అన్నారు. బిఆర్‌ఎస్ పాలనలో మహిళలపై ఎన్ని నేరాలు జరిగాయో మేమూ నివేదిస్తామని అన్నారు. యధాలాపంగా మాట్లాడా అంటూనే వాళ్ల పార్టీ ఎమ్మెల్యేలతో కేటీఆర్ ఇంకా తిట్టిస్తున్నాడని అన్నారు. రుణమాఫీ చేయలేని బిఆర్‌ఎస్ ప్రభుత్వం తాము పూర్తి గా రుణమాఫీ చేయకముందే విమర్శలు ఎందుకు చేస్తున్నారని నిలదీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News