Monday, January 20, 2025

వయనాడ్ ప్రజలకు సీతక్క చేయూత

- Advertisement -
- Advertisement -

పకృతి విలయానికి అతలాకుతమైన కేరళలోని వయనాడ్ లో తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అనసూయ సీతక్క శనివారం పర్యటించారు. ములుగు డిసిసి అధ్యక్షుడు పైడాకుల అశోక్ తో కలిసి ప్రభావిత ప్రాంతాలను సందర్శించిన మంత్రి సీతక్క, బాధిత కుటుంబాల సహాయార్థం తాను సేకరించిన రూ.20 లక్షల చెక్‌ను స్థానిక ఎమ్మెల్యే టి.సిద్దికికి అందించారు. దీంతో పాటు సుమారు పది లక్షల విలువైన దుస్తులు, నిత్యావసర వస్తువులను స్థానిక నాయకులు అందజేశారు. వందల సంఖ్యలో మృతులను సామూహిక ఖననం చేసిన ముండక్కై స్మశాన వాటికలో మృతులకు మంత్రి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం అక్కడి మీడియాతో మాట్లాడిన సీతక్క ఇటువంటి కష్టం పగోడికి కూడా రావోద్దన్నారు. ప్రభావితమైన ప్రాంతాలను చూసి హృదయం ద్రవించిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

పోయిన ప్రాణాలను తీసుకురాలేకపోయినా తనకు ఎంతో అనుబంధం ఉన్న వయానాడ్ ప్రజలకు నైతిక మద్దతు పలకానికి వచ్చినట్లు తెలిపారు. వాయనాడ్ ఎల్లప్పుడూ తన హృదయానికి దగ్గరగా ఉంటుందన్నారు. నేటికి 24 గంటలూ పనిచేస్తున్న సహాయ బృందాలు, స్థానిక అధికారులు, వాలంటీర్ల అవిశ్రాంత ప్రయత్నాలను అభినందిస్తున్నట్లు వెల్లడించారు. సీతక్క ప్రయత్నాలను తెలుసుకున్న పలువురు నాయకులు తమ వంతు సహకారం ఆందించారు. ములుగు డీసీసీ అధ్యక్షుడు పైడాకుల ఆశోక్, ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్‌చార్జి కంది శ్రీనివాస్ రెడ్డి, టీపీపీసీ ప్రధాన కార్యదర్శి సత్తుమల్లేష్ తదితర నాయకులు ఆర్ధికంగా సహకరించారు. ములుగు, ఆదిలాబాద్ పార్టీ శ్రేణులు ముందుకొచ్చి చేయుత నిచ్చారు. మంత్రి సీతక్క భద్రత, వ్యక్తిగత సిబ్బంది సైతం తమ వంతుగా రూ.50 వేల సహాయం చేశారు. వయనాడ్ ప్రజల కోసం ముందు కొచ్చి నిధులు, వస్తువులు అందచేసిన వారికి, బాలవికాస్ వంటి స్వచ్చంధ సంస్థలకు మంత్రి సీతక్క కృతజ్నతలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News