Monday, November 18, 2024

ఆరు గ్యారెంటీల అమలుపై విపక్షాలకు కడుపు మంట:మంత్రి సీతక్క

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ః రాష్ట్రంలో పేదల అభివృద్ది కోసం తమ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను దశల వారీగా అమలు చేస్తుంటే విపక్ష నాయకులకు కడుపు కాలుతోందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం అంబేద్కర్ సచివాలయంలోని తన కార్యాలయంలో మాట్లాడుతూ తమ ప్రభుత్వం రాష్ట్రంలో కొలువుదీరి నెలరోజులు కూడా గడవక ముందే తమపై ప్రతిపక్ష పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించడం వారు ఓర్చుకోలేకపోతున్నారని, ఈపథకం విఫలం కావాలని కలలు కంటున్నారని పేర్కొన్నారు. గత పాలకులు ప్రచారం చేస్తున్న అవాస్తవాలను సమర్ధవంతంగా కాంగ్రెస్ శ్రేణులు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల మేరకు ప్రతి ఒక్క హామీని అమలు చేసి చూపిస్తామని హితవు పలికారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లు సాధించేలా ప్రతి ఒక్కరూ విధిగా ఓటేసి ఆశీర్వదించాలని పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News