Saturday, July 6, 2024

అథ్లెట్ కు సీతక్క చేయూత

- Advertisement -
- Advertisement -

ఒలింపిక్స్ లో మన దేశం తరపున పాల్గొనేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం కోయ నర్సాపురం గ్రామానికి చెందిన అథ్లెట్ పాయం కుమారి సన్నద్ధం అవుతున్నారు. ఛత్తీస్ గఢ్ లో ప్రత్యేకంగా శిక్షణ పొందుతున్నారు. అయితే నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన కుమారి ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్కను సాట్స్ చైర్మన్ శివసేనారెడ్డితో కలిసి సచివాలయంలో కలిసిన ఆమె తనకు సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

వెంటనే స్పందించిన మంత్రి సీతక్క.. భద్రాచలం ఐటిడిఏ అధికారులతో మాట్లాడారు. అవసరమైన సహాయ సహకారాలు అందించాలని ఆదేశాలు జారీ చేశారు. తక్షణ సహాయం కింద వ్యక్తిగతంగా అయిదు వేల రూపాయల ఆర్థిక సహాయం చేశారు మంత్రి సీతక్క. జాతీయ, అంతర్జాతీయ క్రీడా వేదికలపై తెలంగాణ, దేశ కీర్తిని చాటేలా క్రీడాకారులందరినీ తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, అన్ని రకాలుగా ఆదుకుంటుందని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్కకి పాయం కుమారి, ఆమె కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News