Monday, January 6, 2025

సినీ నటుడు అలీని సత్కరించిన మంత్రి సీతక్క

- Advertisement -
- Advertisement -

సామాజిక బాధ్యతగా మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు వ్యతిరేకంగా పాటను రూపొందించిన సినీ హాస్య నటుడు అలీని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అనసూయ సీతక్క శాలువాతో సత్కరించి అభినందించారు. శనివారం సచివాలయంలో మంత్రి సీతక్క పేషీలో ఆమెను మర్యాద పూర్వకంగా అలీ, డైరెక్టర్ రమణారెడ్డిలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ సామాజిక బాధ్యతతో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు వ్యతిరేకంగా తాను చిత్రీకరించిన ‘నిన్ను నన్ను కన్నది ఆడది రా’ అనే పాటను అలీ మంత్రి సీతక్కకు చూపించారు. ఈ పాటను ప్రసాద్ ల్యాబ్స్‌లో ఈ నెల 8 సాయంత్రం ఆవిష్కరిస్తున్నట్లు మంత్రికి వివరించారు. ఈ పాట ఆవిష్కరణకు మంత్రి సీతక్కను ముఖ్య అతిథిగా హాజరు కావాలని అలీ ఆహ్వానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News