Wednesday, January 22, 2025

రాహుల్ గాంధీ పొలిటీషియనే కాదు: సీతక్క

- Advertisement -
- Advertisement -

రాహుల్ గాంధీ పొలిటీషియనే కాదు, ఆయన ఒక వారియర్, గొప్ప రిఫార్మర్ అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అనసూయ సీతక్క కొనియాడారు. రాహుల్ గాంధీ సామాజిక విప్లవ కారుడు, గొప్ప ఉద్యమ కారుడుగా ఆమె అభివర్ణించారు. మహరాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఉన్న మంత్రి సీతక్క బుధవారం వీడియో సందేశం ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. కులగణనలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. నేటి నుంచి ప్రారంభమైన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో ఊరూరా ఉత్సవంగా, ఉద్యమంగా తమ వివరాలు నమోదు చేసుకోవాలని చెప్పారు. దేశ వ్యాప్తంగా కుల గణన జరిగితే అట్టడుగు వర్గాలకు, అభివృద్దికి దూరంగా ఉన్న కులాలకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కులగణన జరగాలని ఎంతో కాలంగా పోరాటం చేస్తున్నారని అన్నారు. రాహుల్ గాంధీ ప్రజల పక్షాన నిలిచి ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణలో కులగణన మొదలు పెట్టారని తెలిపారు. దేశంలో కుల గణనకు తొలి అడుగు తెలంగాణలోనే పడిందన్న సీతక్క ఎక్స్ రే లాగా కుల గణన జరిగితే ప్రజల స్థితిగతులు తెలుస్తాయని అన్నారు. తెలంగాణలో కులగణన ప్రక్రియను ప్రారంభించిన సిఎం, సహచర మంత్రులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. కుల గణనలో ప్రతి ఒక్కరు పాల్గొని తమ సమగ్ర వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. సామాజిక, ఆర్దిక, రాజకీయ, కుల వివరాలు తెలిసినప్పుడే అన్ని రంగాల్లో అట్టడుగు వర్గాలకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News