Friday, January 24, 2025

గ్రామీణాభివృద్ధికి పెద్దపీట

- Advertisement -
- Advertisement -

గ్రామాల్లో రోడ్లు, సదుపాయాల
కల్పనకు రూ.2,773కోట్ల
మంజూరు ఇప్పటికే
రూ.2682కోట్లు విడుదల చేసిన
రాష్ట్ర ప్రభుత్వం
పంచాయతీరాజ్‌శాఖ మంత్రి
సీతక్క వెల్లడి రాష్ట్రవ్యాప్తంగా
85శాతం గ్రామ సభలు పూర్తి
నేడు 2279 పంచాయతీల్లో
గ్రామసభలు

మన తెలంగాణ/హైదరాబాద్ : గ్రామీణాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని మంత్రి సీతక్క అన్నారు. గ్రామీణాభివృద్ధికి నిధులు మం జూరు చేసిన ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కను గు రువారం ప్రజా భవన్‌లో కలిసి పూల మొక్క అందచేసి మంత్రి సీతక్క ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ గ్రామీణాభివృద్దికి మా ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని సీతక్క అన్నారు. ఎన్నడూ లేని విధంగా నిధులు మంజూరు చేసిన పనులు చేయిస్తున్నామని వెల్లడించారు. మొదటి విడతలో రూ. 2682 కోట్లు కే టాయించినట్లు తెలిపారు. తాజాగా మరో రూ. 2773 కోట్లు మంజూరు చేసినట్లు ప్రకటించారు. ఇవే కాకుండా ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన కింద రూ.197 కోట్లు మంజూరు చేసిన ట్లు స్పష్టం చేశారు. గతంలో పీఎంజీఎస్ కోసం రూ. 110 కోట్లు విడుదల చేసినట్లు వివరించారు. పల్లెల్లో రోడ్లు, డ్రైనేజీలు, ఇతర మౌలిక వసతుల కల్పన కోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. రాబోయే కాలంలో మరిన్ని నిధులను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే క్షేత్ర స్ధాయి పంచాయతీ రాజ్ రూరల్ ఇంజనీరింగ్ అధికారులకు వాహన సదుపాయం తెలంగాణ ప్రభుత్వం కల్పించిందన్నారు.

పనుల పర్యవేక్షణ కోసం ఈఈలు, డిప్యూటీ ఈఈలు, ఎస్‌ఈ లకు వెహికిల్స్ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. 237 మంది ఇంజనీరింగ్ అధికారులకు రూ. 5 కోట్లు మంజూరు చేసినట్లు ప్రకటించారు. ఒక్కో వాహన అద్దె చెల్లింపు కోసం నెలకు రూ.33 వేలు విడుదల చేసినట్లు వెల్లడించారు. గత ప్రభుత్వంలో అధికారులకు వెహికిల్స్ అలవెన్స్ లేదని, మారు మూల ప్రాంతాల్లో జరిగే పనుల పర్యవేక్షణకు వెల్లేందుకు ఇంజనీర్లు ఇబ్బందులు పడ్డారని ఆరోపించారు. వాల్ల ఇబ్బందులను గుర్తించిన ప్రభుత్వం, వాహన సదుపాయం కల్పించిందన్నారు. ఈ సందర్భంగా వాహన సదుపాయం కల్పించిన ప్రభుత్వానికి రుణ పడి ఉంటామని పంచాయతీ రాజ్ విభాగ ఈఎన్‌సీ కనకరత్నం ప్రకటించారు. గతంలో వాహన అలవెన్స్ లేకపోవడంతో ఇంజనీర్లు అవస్థలు పడ్డారని కనకరత్నం తెలిపారు. వాహన కష్టాలు తీర్చిన ప్రభుత్వానికి, మంత్రి సీతక్కకు కనకరత్నం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

85 శాతం గ్రామ సభలు పూర్తి : రాష్ట్ర వ్యాప్తంగా నేటి వరకు 13,861 గ్రామాలు, వార్డుల్లో గ్రామ సభలు (85.96 శాతం) పూర్తయ్యాయని ప్రభుత్వం ప్రకటించింది. గ్రామ సభలు ప్రారంభమైన మూడోరోజైన గురువారం 3,986 గ్రామ సభలు విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ గ్రామ, వార్డు సభలకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరై ప్రభుత్వం ప్రారంభించనున్న నాలుగు పథకాలకు సంబంధించి తమ దరఖాస్తులు అందచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నేడు గ్రామ సభలు 3130, వార్డు సభలు 856 నిర్వహించడం జరిగింది. ఈ గ్రామ సభలలో పలువురు రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు,అధికారులు పాల్గొన్నారు. గురువారం 3,197 గ్రామపంచాయతీల్లో గ్రామసభలు జరగగా ఇప్పటివరకు 10,495 గ్రామపంచాయతీల్లో గ్రామసభలు ముగిశాయి. పదేళ్ల తర్వాత గ్రామసభలు నిర్వహిస్తుండటంతో పల్లెల్లో పండగ వాతావరణం నెలకొంది. పలకరింపులు, ఆప్యాయతల కలబోతగా గ్రామసభలు నిర్వహిస్తున్నారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి లబ్ధి చేయాలన్న తలంపుతో ప్రభుత్వం ఉంది. అందరూ దరఖాస్తులు చేసుకునే వెసులుబాటు ఉండటంతో గ్రామస్తుల్లో ఆత్రుత తగ్గింది. ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా గ్రామసభలు కొనసాగుతున్నాయి. దాపరికాలు లేకుండా పూర్తి పారదర్శకంగా గ్రామసభల వేదికగానే అర్హులను గుర్తిస్తుండటంతో పల్లెలు ప్రశాంతంగా ఉన్నాయి. శుక్రవారం 2,279 గ్రామ పంచాయతీల్లో గ్రామసభలు జరగనున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News