Wednesday, October 16, 2024

పోయిరా బతుకమ్మ…

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ విద్యానగర్: అసమానతలు లేని సమాజాన్ని నిర్మించాల్సిన బాధ్యత ప్రజలందరిపైన ఉందని మహిళ, శిశు సంక్షేమం, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి సీతక్క అభిప్రాయ పడ్డారు. అంతరాల నిర్మూలనే లక్ష్యంగా సిఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర భాషా, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ ఉత్సవాలు గురువారం రాత్రి ట్యాంక్‌బండ్ పైన ఆర్భాటంగా జరిగాయి. సచివాలయం ముందున్న అమరవీరుల స్థూపం నుంచి తీరొక్క పువ్వులతో చేసిన బతుకమ్మలను ఎత్తుకుని పెద్ద సంఖ్యలో మహిళలు టాంక్ బండ్ లేపాక్షి వద్ద ఏర్పాటు చేసిన ప్రాంగణానికి భారీ ప్రదర్శనగా వచ్చారు. మంత్రి సీతక్క, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత , ప్రిన్సిపల్ సెక్రటరీ వాణి ప్రసాద్‌లు బతుకమ్మలను ఎత్తుకుని ముందు నడువగా వారివెంటే వివిధ జిల్లాల నుంచి వచ్చిన కళాకారులు ప్రదర్శనగా సాగారు.

బోనాలు ఎత్తుకుని మహిళలు, కోలాట బృందం, కొమ్ము కోయ కళాకారులు, చిరుతల భజన, పోత రాజులు, శివసత్తులు, డప్పు వాయిద్యాలు, బూర, ఘట విన్యాసాలు, బంజారా నృత్యం ఆద్యంతం కోలాహలంగా సాగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదిక నుంచి మంత్రి సీతక్క మాట్లాడుతూ మహిళలకు తోడుగా నిలవాలని పురుషులకు సూచించారు.ఆడపిల్లలను బతకనివ్వాలని, ఉన్నతంగా ఎదగనివ్వాలని పిలుపు ఇచ్చారు. బతుకమ్మ అంటే బతుకు ఇచ్చే పండుగ అని గుర్తు చేశారు. తెలంగాణ అంటేనే చెరువులు, కుంటలు అని, వాటిపైనే ఆధారపడి మన జీవనమని చెప్పారు. చెరువులు నిండితేనె పంట, పండుగ, అందువల్ల చెరువులను రక్షించుకుని, బతుకమ్మ పండుగకు మరింత జీవం పోయాలన్నారు.మన పూర్వీకుల అన్నీ రకాల
ఆచారాలు, సంప్రదాయాలలో విజ్ఞానం దాగి ఉందని, బతుకమ్మ పండుగతో చెరువులు శుద్ధి అవుతాయని తెలిపారు.అరుణోదయ విమలక్క మాట్లాడుతూ చెరువులు, కుంటలను కాపాడుకోవాలన్న సీఎం రేవంత్ రెడ్డి పిలుపును ప్రతి ఒక్కరు స్వాగతించాలన్నారు.బతుకమ్మకు కులం, మతం లేధని, సామాజిక ఆర్థిక అసమానతలు తొలిగి పోవాలని ఆకాంక్షించారు.హైడ్రా తో చెరువులు, ప్రకృతిని కాపాడుకోవాలన్న నిర్ణయాలు మంచివే, అదే సమయంలో పేదల అభ్యున్నతికి కృషీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అడబిడ్డలు స్వేచ్చగా తిరిగేలా చర్యలు తీసుకోవాలని సిఎం రేవంత్ రెడ్డికి ఆమె విజ్ఞప్తి చేశారు.

హైదరాబాద్ నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ పర్యాటక సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి వాణి ప్రసాద్, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ అలేఖ్య పులిజాల, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు సుజాత, శోభా, టూరిజం డైరెక్టర్ ఇలా త్రిపాటి, స్పెషల్ కమిషనర్ హనుమంత రావు, జిల్లా కలెక్టర్ అనుదీప్ సహ వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వివిధ కళా రూపాల ప్రదర్శనలు, దాదాపు 40 నిమిషాలకు పైగా సాగిన లేజర్ షో, బాణసంచా వెలుగులు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News