Monday, December 23, 2024

మేడారం జాతరపై అధికారులతో సమీక్షిస్తాం: మంత్రి సీతక్క

- Advertisement -
- Advertisement -

ములుగు: దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతి పెద్ద జాతర మేడారం జాతర అని.. ఈ మహాజాతరను విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు రాష్ట్ర పంచాయతీరాజ్, మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క. మేడారంలోని మీడియా పాయింట్ వద్ద శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. నాలుగు రోజులలో 1కోటి 45 లక్షల మంది భక్తులు వనదేవతలను దర్శించుకున్నారని చెప్పారు. అమ్మవార్లను దర్శించుకోవడానికి ఇంత పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడం ఈ ప్రాంత వాసులుగా మాకు గర్వకారణమని అన్నారు. జాతర నిర్వహణకు అత్యధికంగా నిధులు కేటాయించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు మంత్రి.

ఆర్టీసీ సంస్థ ద్వారా మేడారం జాతరకు 6 వేల బస్సు 10 వేల ట్రిప్పుల బస్సులు నడిచాయన్నారు. 13మంది వివిఐపిలు 150 మంది వీఐపీలు అమ్మవార్లను దర్శించుకున్నారని తెలిపారు. ఇద్దరు భక్తులు ప్రమాద వశాత్తూ చనిపోవడం జరిగింది. గతంతో పోలిస్తే ఈ జాతర చాలా మెరుగ్గా జరిగిందన్నారు. అమ్మవార్ల వన ప్రవేశానికి వెళ్లే సమయం వచ్చినప్పటికీ ..ఇంకా, భక్తుల రద్దీ కొనసాగుతుందన్నారు. జాతరలో ఏమైనా లోపాలు ఉంటే అధికారులతో సమీక్ష నిర్వహించి తిరుగువారం తర్వాత శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తామని సీతక్క చెప్పారు.

జాతర పూర్తైన పది రోజుల వరకు కూడా పారిశుధ్యం పనులు కొనసాగుతుంటాయని, తక్కువ కాలంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం, జాతరకు సహకరించిన పూజారులు, ఆదివాసీలు, అధికారులు, భక్తులు అందరికీ ధన్యవాదాలు చెబుతున్నాని అన్నారు. కచ్చితంగా అందరి సూచనలు సలహాలు పాటిస్తామని.. వచ్చే జాతరలో ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా చూస్తామని మంత్రి సీతక్క తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News