ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ అరెస్టు వ్యవహారంపై మంత్రి సీతక్క స్పందించారు. ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అల్లుఅర్జున్ అరెస్టులో ప్రభుత్వం జోక్యం లేదన్నారు. అల్లు అర్జున్ అరెస్ట్ చట్టప్రకారమే జరిగిందని.. మాకెలాంటి కక్ష లేదని చెప్పారు. అల్లు అర్జున్ భార్య తరుపున సీఎం రేవంత్‌రెడ్డికి బంధుత్వం ఉందిని..ఈ విషయంలో ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదని చెప్పారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, చట్టం ముందు అందరూ సమానమేనని అన్నారు.
కాగా, పుష్ప2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట కేసులో శుక్రవారం చిక్కడపల్లి పోలీసులు అల్లుఅర్జున్ అరెస్టు చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్ తరలించారు.. అక్కడ నుంచి వైద్య పరీక్షల కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత నాంపల్లి కోర్టులో హాజరు పర్చగా.. న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో హైకోర్టును ఆశ్రయించగా.. సుదీర్ఘ వాదనల తర్వాత అల్లుఅర్జున్ కు 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే, బెయిల్ ప్రాసెస్ లేట్ కావడంతో నిన్న ఆయన చంచల్ గూడ జైలులోనే ఉండాల్సి వచ్చింది. శనివారం ఉదయం ఆయన జైలు నుంచి విడుదలయ్యారు.