Sunday, April 13, 2025

దేశంలో ఎక్కడా లేనివిధంగా సన్న బియ్యం పథకం:మంత్రి సీతక్క

- Advertisement -
- Advertisement -

దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి పేద ప్రజలు, మహిళలకు అన్ని వర్గాల ప్రజలకు చేదోడు వాదోడుగా నిలుస్తోందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ (సీతక్క) అన్నారు. మహబూబాబాద్ జిల్లా, కొత్తగూడ మండలం, గుంజేడు గ్రామంలో శుక్రవారం రేషన్ కార్డుదారుడు సిరబోయిన క్రాంతి కుమార్, పద్మ ఇంట్లో జిల్లా కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్, అటవీ శాఖాధికారి బత్తుల విశాల్ తదితర అధికారుతో కలిసి మంత్రి సీతక్క సన్న బియ్యం భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం పథకం దేశానికే ఆదర్శమని అన్నారు. ప్రతి పేదవాడి ఆకలి తీర్చేందుకు ఈ సన్న బియ్యం పథకం ఎంతో ఉపయోగపడుతుందన్నారు.

ఇప్ప పువ్వు ద్వారా ఉత్పత్తి అయ్యే పదార్థాల ద్వారా మహిళలకు ప్రతి ఒక్కరికీ ఎంతో ఆరోగ్యకరమైన పదార్థాలు తయారుచేయాలన్నారు. సోలార్ విద్యుత్ సరఫరా ప్లాంటు, వ్యవసాయ ఆధారిత వ్యాపారాలతో పాటు వాణిజ్య వ్యాపారాలను ప్రారంభించారు. గుంజేడు ముసలమ్మ గ్రామైక్య సంఘానికి రూ.60.51 లక్షల వడ్డీలేని రుణాలు, రూ.25 కోట్ల బ్యాంకు లింకేజీ చెక్కులు పంపిణీ చేశారు. గంగారం మండలానికి రూ.15 లక్షల వడ్డీలేని రుణాలు, రూ.10 కోట్ల బ్యాంకుల లింకేజీ మంజూరు చేశామని అన్నారు. గుంజేడు ముసలమ్మ ఆలయాభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ ప్రకటించి రూ.50 లక్షల వ్యయంతో వివిధ అభివృద్ధి పనులను చేపట్టడం కోసం ప్రతిపాదన సిద్ధం చేయాలని, చుట్టుపక్కల అడవిని పెంపొందించాలని, ప్రభుత్వం ఆలయ అభివృద్ధి కమిటీ ద్వారా ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఆలయ ప్రాంగణంలో భక్తుల సౌకర్యార్థం అంతర్గత రోడ్ల అభివృద్ధి, తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్ల సౌకర్యం, క్యూలైన్ల నిర్మాణం, తదితర సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News