మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా తొలి రోజు జరిగిన గ్రామసభల్లో అక్కడక్కడ జరిగిన రసాభస, ఆందోళనలు, ఉద్రిక్తతలకు బిఆర్ఎస్ నాయకులే కారణమని, బిఆర్ఎస్ ఆదిప త్యం ఉన్న గ్రామాల్లోనే ఇలా జరిగిందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డా.అనసూయ సీతక్క అన్నారు. గతంలో ఫామ్ హౌస్‌లో, ఎమ్మెల్యేలు ఇండ్లలో కూర్చొని లబ్ధిదారులను ఎంపిక చేశారని ఆరోపించారు. ప్రజాస్వామ్యబద్ధంగా తాము లబ్ధిదారులను గుర్తిస్తుంటే కావాలనే బీఆర్ఎస్ రాద్ధాంతం చేస్తోంద ని ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయంలో బు ధవారం మంత్రి మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడుతూ పదేళ్ల తర్వాత గ్రామ సభలు జరుగుతున్నందున ప్రజలు సంతోషంగా ఉన్నారని, గ్రామ సభల్లోనే అర్హులను గుర్తిస్తున్నామని తెలిపారు. తొలి రోజు మంగళవారం మొత్తం 3410 గ్రామా ల్లో గ్రామసభలు జరగ్గా, కేవలం 142 గ్రామాల్లో నే ఆందోళనలు జరిగాయని తెలిపారు. అంటే కేవలం నాలుగు శాతం గ్రామాల్లోనే కొంత గొడ వ జరిగిందని, 96 శాతం గ్రామాల్లో ప్రశాంత వాతావరణంలో గ్రామసభలు జరిగినట్టు స్పష్టమైందని అన్నారు.
గొడవలు జరిగిన చోట్ల టిఆర్ఎస్ వాళ్ళు ఉద్దేశ పూర్వకంగా చేసినవేనని ఆరోపించారు. గతంలో ఎంఎల్ఏలు చెప్పిన వాళ్ళకే పథకాలు వచ్చేవన్నారు. తమ ప్రజా ప్రభుత్వం లో గ్రామ సభల్లోనే ప్రజల సమక్షంలో లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని తెలిపారు. ప్రజాస్వామ్యబద్ధంగా లబ్ధిదారులను గుర్తిస్తుంటే కావాలనే టిఆర్ఎస్ రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డా రు. బిఆర్ఎస్ హయాంలో ఓట్లప్పుడే పథకా లు అరకొరగా ఇచ్చేవారని, కానీ ప్రజా అవసరాలు, ఆర్థిక వనరులను బట్టి పథకాలను అమలు చేస్తున్నామని మంత్రి సీతక్క పేర్కొన్నారు. పదేళ్లుగా రే షన్ కార్డులు ఇవ్వలేదని, అందుకే ఉద్దేశ పూర్వకంగా బిఆర్ఎస్ పార్టీ నేతలు గొడవలు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్, కేటీఆర్ మాటలు నమ్మి కొందరు ఆర్థిక సామాజిక రాజకీయ కుల సమగ్ర ఇంటిటి సర్వేలో పాల్గొనలేదని, అటువంటి వారికి ఇప్పుడు పథకాలు రావనే ఆందోళన చెందుతున్నారని అన్నారు.
ఏ ఒక్క అర్హుడు నష్టపోకుండా ప్రజాపాలన దరఖాస్తులు తీసుకున్నామని, గ్రామ సభల్లో కూడా దరఖాస్తులు తీసుకుంటున్నామని తెలిపారు. పది సంవత్సరాల్లో అన్ని సాఫీగా చేస్తే ఇన్ని సమస్యలు ఎందుకు ఉంటాయని ఆమె ప్రశ్నించారు. వందల ఎకరాలు ఉన్న భూస్వాములకు రైతుబంధు ఇచ్చారని, కానీ రెక్కల కష్టాన్ని నమ్ముకున్న కూలీలకు ఎలాంటి సహాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులందరికీ రేషన్ కార్డులు, ఇతర పథకాలు ఇస్తామని, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. టిఆర్ఎస్ హయాంలో అద్భుతాలు ఏమి జరగలేదన్న మంత్రి బెలూన్ లాగా తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఒకే సారి అమాంతం పైకి రాలేదని ఎద్దేవా చేశారు. టిఆర్ఎస్ పాలనకు ముందు కాంగ్రెస్ హయాంలో తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందలేదా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పాటు చేసి , ప్రైవేట్ కంపెనీలను ప్రోత్సహించి తెలంగాణ ప్రాంత అభివృద్ధికి కాంగ్రెస్ బాటలు వేసిందని అన్నారు. మంచి నీ తమ ఖాతాల్లో, చెడును మంది ఖాతాల్లో వేయడం టిఆర్ఎస్ నాయకులకు అలవాటేనని మంత్రి సీతక్క ధ్వజమెత్తారు.