Wednesday, January 22, 2025

పదేళ్లు రేషన్ కార్డులే ఇవ్వలేదు:మంత్రి సీతక్క

- Advertisement -
- Advertisement -

పదేళ్లుగా రేషన్ కార్డులు ఇవ్వలేదని, అందుకే ఉద్దేశ పూర్వకంగా బిఆర్‌ఎస్ పార్టీ నేతలు గొడవలు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్, కేటీఆర్ మాటలు నమ్మి కొందరు ఆర్థిక సామాజిక రాజకీయ కుల సమగ్ర ఇంటిటి సర్వేలో పాల్గొనలేదని, అటువంటి వారికి ఇప్పుడు పథకాలు రావనే ఆందోళన చెందుతున్నారని అన్నారు. ఏ ఒక్క అర్హుడు నష్టపోకుండా ప్రజాపాలన దరఖాస్తులు తీసుకున్నామని, గ్రామ సభల్లో కూడా దరఖాస్తులు తీసుకుంటున్నామని తెలిపారు. పది సంవత్సరాల్లో అన్ని సాఫీగా చేస్తే ఇన్ని సమస్యలు ఎందుకు ఉంటాయని ఆమె ప్రశ్నించారు.

వందల ఎకరాలు ఉన్న భూస్వాములకు రైతుబంధు ఇచ్చారని, కానీ రెక్కల కష్టాన్ని నమ్ముకున్న కూలీలకు ఎలాంటి సహాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులందరికీ రేషన్ కార్డులు, ఇతర పథకాలు ఇస్తామని, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. టిఆర్‌ఎస్ హయాంలో అద్భుతాలు ఏమి జరగలేదన్న మంత్రి బెలూన్ లాగా తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఒకే సారి అమాంతం పైకి రాలేదని ఎద్దేవా చేశారు. టిఆర్‌ఎస్ పాలనకు ముందు కాంగ్రెస్ హయాంలో తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందలేదా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పాటు చేసి , ప్రైవేట్ కంపెనీలను ప్రోత్సహించి తెలంగాణ ప్రాంత అభివృద్ధికి కాంగ్రెస్ బాటలు వేసిందని అన్నారు. మంచి నీ తమ ఖాతాల్లో, చెడును మంది ఖాతాల్లో వేయడం టిఆర్‌ఎస్ నాయకులకు అలవాటేనని మంత్రి సీతక్క ధ్వజమెత్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News