Monday, January 20, 2025

పోడుభూమి నా తండ్రికి చట్టం కల్పించిన హక్కు: మంత్రి సీతక్క

- Advertisement -
- Advertisement -

శాసనసభ సమావేశాల్లో భాగంగా మంగళవారం శాసనసభలో చర్చసందర్భంగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో మంత్రి సీతక్క తండ్రికి పోడు భూముల పట్టా ఇచ్చామన్నారు. పోడుభూముల పంపిణీలో గత ప్రభుత్వం అందరికీ న్యాయం చేసిందన్నారు. మంత్రి సీతక్క తండ్రికి సైతం తమ ప్రభుత్వమే పోడు భూమల పట్టాలు ఇచ్చిందన్నారు. గిరి వికాస్ పథకం కింద అన్ని ఎస్టీ కుటుంబాలకు రూ.2 లక్షలు ఇచ్చామని తెలిపారు. విద్యలో అనేక సంస్కరణలు తీసుకువచ్చిందని చెప్పారు. ఎస్సీ, ఎస్టీల కోసం బీఆర్‌ఎస్ ప్రభుత్వం గురుకులాలను తీసుకువచ్చిందని వెల్లడించారు. గిరిజన రైతులకు పట్టాలు ఇచ్చిన ఘనత బీఆర్‌ఎస్ ప్రభుత్వానిదని, గిరిజనుల కోసం అనేక పథకాలు తీసుకువచ్చిందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే అనిల్ జాదవ్ వ్యాఖ్యలపై మంత్రి సీతక్క అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్టీలకు ఏం చేయలేదన్నట్లుగా ఎమ్మెల్యే మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్టీల కోసం 2006లో పోడుభూముల చట్టం తీసుకువచ్చిందన్నారు. ఈ చట్టం ద్వారా అనేక గిరిజనులకు లబ్ధి చేకురిందని తెలిపారు. పది ఎకరాల వరకూ గిరిజనులకు హక్కు వుందని , ఏది దానంగానో ,ఊరికనో రాదన్నారు.తాను ఎమ్మేల్యేకాకుముందు నుంచే ఆడవిని ఆధారంగా చేసుకుని జీవనం సాగించే కుటంబాలు తమవి అని తెలిపారు. నుంచే పదేళ్లు అధికారంలో ఉన్నా బీఆర్‌ఎస్ ఎస్టీలకు ఏం చేయలేదని, గులాబీ పార్టీ పదేళ్ల పాలనలో ఎంతమంది ఎస్టీలకు ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ పాలనలో ఎస్టీలకు ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదని ఆరోపించారు. పదేపదే తన తల్లిదండ్రలకు భూమి ఇచ్చామంటున్నారని, తన తల్లిదండ్రులకు చట్టప్రకారమే పోడుభూముల హక్కు వచ్చిందని స్పష్టం చేశారు. తమవి అడవిని ఆధారంగా చేసుకుని బతికే కుటుంబాలని, ఆ భూమిపై సంప్రదాయంగా వచ్చిన హక్కు అది అని సీతక్క పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చిన భూమి కాదని తేల్చి చెప్పారు.బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన శాసనసభ్యులు రైతుబంధు పధకం కింద నిధులు ఎందుకు తీసుకున్నారో చెప్పాలని ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News