Sunday, December 22, 2024

మా నోళ్లను కాదు..మీ నోరే యాసిడ్ తో కడగాలి:కెటిఆర్‌కు మంత్రి సీతక్క కౌంటర్

- Advertisement -
- Advertisement -

పండగ పూట మహిళల పట్ల చీప్ కామెంట్ చేసే కేటీఆర్ నోటినే యాసిడ్ తో కడగాలని పంచాయతీరాజ్, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి అనసూయ సీతక్క ఘాటుగా జవాబిచ్చారు. మా నోళ్లను పినాయిల్ తో కడగాలని మాట్లాడిన కుసంస్కారి కేటీఆర్‌కు ఒకటే చెబుతున్నామని, మీ నోరే యాసిడ్ తో కడగాలని మండిపడ్డారు. తెలంగాణ ఆడబిడ్డల పండుగ బతుకమ్మ మొదటి రోజే మహిళా మంత్రులను కించ పరిచి కేటీఆర్ తన నైజం చాటుకున్నారని, కేటీఆర్ గలీజ్ మాటలు వినాల్సి రావటం మన దురదృష్టమని వ్యాఖ్యానించారు.

రాఖీ పండగ రోజు బస్సుల్లో మహిళలు బ్రేక్ డాన్సులు చేసుకోవచ్చు అని మాట్లాడిన కెటిఆర్ బతుకమ్మ పండుగ మొదటి రోజు చిట్ చాట్ పేరుతో మహిళా మంత్రుల గురించి చానా చులకనగా మాట్లాడారని ఆరోపించారు. మహిళా మంత్రులను పదే పదె కించపరుస్తూ తన దొర దురంకారాన్ని కేటీఆర్ చాటుకుంటున్నారని అన్నారు. దూషణలకు, బూతులకు బ్రాండ్ అంబాసిడరే మీరే అంటూ కెటిఆర్‌పై ధ్వజమెత్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News