Sunday, January 19, 2025

మేడారం జాతర పనుల్లో వేగం పెంచండి: మంత్రి సీతక్క

- Advertisement -
- Advertisement -

ములుగు : మేడారం జాతర పనుల్లో వేగం పెంచి, త్వరితగతిన పనులు పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. సోమవారం తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క, సారలమ్మ వన దేవతలను ఆమె దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా మంత్రి గోవిందరావుపేట మండలంలోని పస్రా వద్ద ఉన్న గుండ్లవాగు బ్రిడ్జిని, దయ్యాల వాగు సమీపంలో ఉన్నరోడ్డును, చింతల్ క్రాస్ వద్ద ఉన్న రోడ్డును , పార్కింగ్ స్థలాలను, ఊరట్టం బ్రిడ్జిని వాహనాల పార్కింగ్ స్థలాలను పరిశీలించారు. చిలుకలగుట్ట, విఐపి పార్కింగ్, బస్టాండ్ ను పరిశీలించి అధికారులకు దిశానిర్ధేశం చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి పనులు వేగవంతం చేసే విధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గాష్ ఆలం, ఐటిడిఏ పిఓ అంకిత్, జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) శ్రీజ, డిపిఓ వెంకయ్య, డిఎస్‌పి రవిందర్, వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బానోత్ రవిచందర్, జిల్లా అధికార ప్రతినిధి, కాసిందేవిపేట సర్పంచ్ ఎండి అహ్మద్ పాషా, తాడ్వాయి మండల పార్టీ అధ్యక్షుడు బొల్లు దేవేందర్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News