Monday, December 23, 2024

తమిళనాడు మంత్రి సెంథీ బాలాజీకి 25 వరకు జ్యుడీషియల్ కస్టడీ

- Advertisement -
- Advertisement -

చెన్నై : మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన తమిళనాడు మంత్రి సెంధీ బాలాజీపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ ) శనివారం ఛార్జిషీట్ దాఖలు చేసింది. కోర్టు ముందు ఆయనను శనివారం హాజరు పర్చగా ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి ఎన్ అల్లి ఈనెల 25 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించారు. గత జూన్ 14న మంత్రి బాలాజీని ఈడీ అరెస్టు చేయగా, అప్పటి నుంచి చెన్నై లోని పుఝాల్ సెంట్రల్ జైలు లోనే ఆయన ఉంటున్నారు. ఈడీ 170 పేజీల ప్రాసిక్యూషన్ ఫిర్యాదును కోర్టుకు సమర్పించింది. ఈ కేసులో దర్యాప్తు చేయడానికి వీలుగా ఐదురోజుల పాటు కస్టడీ లోకి తీసుకోడానికి వీలుగా మంత్రి బాలాజీ అరెస్టుకు జడ్జి అల్లి ఈడీకి ఈ నెల 7న అనుమతించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News