Tuesday, September 17, 2024

బుడమేరు గండ్లు పూడ్చేందుకు ఆర్మీని పిలుస్తున్నాం: శివరాజ్ సింగ్ చౌహాన్

- Advertisement -
- Advertisement -

వరద ముంపు ప్రాంతాల్లో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఏరియల్ సర్వే
వరద నష్టంపై రంగంలోకి దిగిన కేంద్ర బృందాలు
నేడు ఖమ్మం జిల్లాలో కేంద్ర మంత్రులు బండి సంజయ్, చౌహాన్ పర్యటన

మన తెలంగాణ /అమరావతి: రాష్ట్రంలో వరద పరిస్థితిని గురువారం కేంద్ర బృందం పరిశీలించింది. వరదల నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్రం బృందం పర్యటిస్తోంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో పర్యటించిన బృందం సభ్యులు, పరిస్థితిపై బేరీజు వేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ వద్ద దెబ్బతిన్న గేట్లను పరిశీలించారు. ఏపీలో కేంద్ర బృందం పర్యటించింది. కేంద్ర హోం శాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ కుమార్ జిందాల్ నేతృత్వంలోని బృందం రాష్ట్రానికి చేరుకుంది. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల కారణంగా సంభవించిన నష్టాన్ని కేంద్ర బృందం అంచనా వేసింది. నేరుగా నష్టాన్ని పరిశీలించడంతో పాటు వరద బాధితులతో మాట్లాడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.

ఈ క్రమంలోనే ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ప్రధాన కార్యాలయంలో అధికారులతో కేంద్ర బృందం సమీక్ష నిర్వహించింది. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల వల్ల సంభవించిన పరిస్థితులను అధికారులు వారికి వివరించారు. అనంతరం వారు ప్రకాశం బ్యారేజీ వద్ద దెబ్బతిన్న గేట్లను కేంద్ర బృందం పరిశీలించింది. బ్యారేజీ ప్రవాహం ఇతర వివరాలను కేంద్ర బృందానికి జలవనరుల శాఖ ఈఎన్సీ వెంకటేశ్వరరావు వివరించడంతో పాటు అందుకు సంబంధించిన వివరాలను వారికి వివరించారు.

వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్

కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకాశం బ్యారేజీ వద్దకు వచ్చిన కేంద్ర మంత్రి వరద పరిస్థితిని పరిశీలించారు. బ్యారేజీ వద్ద కొనసాగుతున్న గేట్ల మరమ్మతు పనులను పరిశీలించారు. చౌహాన్‌తో పాటు బ్యారేజీ పరిశీలనలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారా లోకేశ్, ఎమ్మెల్యే సుజనా చౌదరి పాల్గొన్నారు. విజయవాడలో వరద పరిస్థితిని కేంద్ర వ్యవసాయశాఖమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్వయంగా పరిశీలించారు. ముందుగా ఎయిర్‌పోర్టులో శివరాజ్ సింగ్‌కు మంత్రులు నారా లోకేశ్, అచ్చెన్నాయుడు, కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, ఎమ్మెల్యే సుజనాచౌదరి, అధికారులు స్వాగతం పలికారు. ఆ తర్వాత ఏరియల్ సర్వే ద్వారా బుడమేరు క్యాచ్‌మెంట్ ఏరియాలను పరిశీలించారు.

వరద ప్రభావిత ప్రాంతాలు జక్కంపూడి మిల్క్ ఫ్యాక్టరీ, కండ్రిక, అజిత్‌సింగ్ నగర్‌ను చూశారు. ఆయా ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని మంత్రి నారా లోకేశ్ చౌహాన్‌కు వివరించారు. ఏరియల్ సర్వే అనంతరం రోడ్డు మార్గంలో వెళ్లి ప్రకాశం బ్యారేజీ గేట్లను పరిశీలించారు. బ్యారేజీ వద్ద కొనసాగుతోన్న గేట్ల మరమ్మతు పనులనూ పరిశీలించారు. బ్యారేజీ మరమ్మతు పనులు చేస్తోన్న వైనాన్ని తెలుసుకున్నారు. చౌహాన్‌తో పాటు బ్యారేజీ పరిశీలనలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారా లోకేశ్, ఎమ్మెల్యే సుజనా చౌదరి పాల్గొన్నారు. భారీ వర్షాల వల్ల ఇటీవల బ్యారేజికి అత్యధికంగా రికార్డు స్థాయిలో వరద వచ్చినట్లు అధికారులు తెలిపారు.

గతంలో ఎన్నడూ లేని రీతిలో 11.46 లక్షల క్యూసెక్కుల పైగా వరద వచ్చినట్లు వెల్లడించారు. వరద ఉద్దృతి వల్ల ఎగువ నుంచి 4 భారీ పడవలు కొట్టుకొచ్చి బ్యారేజిని ఢీకొట్టినట్లు అధికారులు వివరించారు. రెండు గేట్ల వద్ద కౌంటర్ వెయిట్ లు ధ్వంసమైనట్లు తెలిపారు. భారీవరద రావడంతో బ్యారేజీ ఎగువ, దిగువ ప్రాంతాల్లో అపారంగా ఇళ్లు, పొలాలు నీట మునిగాయి అధికారులు మంత్రికి తెలిపారు. బ్యారేజీ వద్ద పర్యటన ముగించుకుని విజయవాడ కలెక్టరేట్‌కి చేరుకున్నారు. వరదనష్టాలపై విజయవాడ కలెక్టరేట్ లోని కమాండ్ కంట్రోల్ రూమ్‌లో ్ల ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర రాష్ట్ర మంత్రులు, అధికారులు తిలకించారు.

బుడమేరు గండ్లు పూడ్చేందుకు ఆర్మీని పిలుస్తున్నాం: కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్

విజయవాడ వచ్చిన కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే అనంతరం ఏపీ సీఎం చంద్రబాబుతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, బుడమేరు గండ్లు పూడ్చేందుకు ఆర్మీని పిలుస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో బుడమేరు వద్ద ఆక్రమణలు పెరిగాయని పేర్కొన్నారు. ఏపీ వరదల గురించి ప్రధాని నరేంద్ర మోడీకి వివరిస్తానని, త్వరగా కేంద్ర ప్రభుత్వ సాయం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. కేంద్ర కమిటీ ఇచ్చే నివేదికను పరిశీలించాక కేంద్రం ఆర్థికసాయం ప్రకటిస్తుందని శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు.

ఇటువంటి కష్ట సమయంలో రాష్ట్రానికి కేంద్రం తప్పకుండా అండగా ఉంటుందని స్పష్టం చేశారు. విజయవాడ ప్రజలు ఐదు రోజుల పాటు వరద నీటిలోనే ఉండిపోయారని, ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో శ్రమించారని కేంద్రమంత్రి కొనియాడారు. దగ్గరుండి మరీ సహాయక చర్యలు పర్యవేక్షించారని కితాబిచ్చారు. వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో సహాయక చర్యలు చక్కగా నిర్వర్తించారని అభినందించారు. డ్రోన్ల ద్వారా ఆహారం, తాగునీరు అందించారని, పారిశుద్ధ్య కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయని ప్రశంసించారు.

అంతకుముందు, వరద ముంపునకు గురైన ప్రాంతాలను ఫొటో ఎగ్జిబిషన్ ద్వారా కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు సీఎం చంద్రబాబు స్వయంగా వివరించారు. అంతేకాదు, కేంద్రమంత్రితో చంద్రబాబు, ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి, మంత్రి నాదెండ్ల మనోహర్ సమావేశమై రాష్ట్రానికి వరద సాయంపై చర్చించారు. ఈ సమావేశంలో కేంద్ర సహాయమంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కూడా పాల్గొన్నారు.

నేడు ఖమ్మం జిల్లాలో కేంద్ర మంత్రుల పర్యటన: ఖమ్మం జిల్లాల్లో కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, బండి సంజయ్ శుక్రవారం ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. ఉదయం 9నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు కేంద్ర మంత్రుల పర్యటన కొనసాగనుంది. సాయంత్రం 4గంటలకు బండి సంజయ్ కోదాడ చేరుకుని వరద బాధితులను పరామర్శిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News