మన తెలంగాణ/హైదరాబాద్: అమెరికాలోని ప్రతిష్టాత్మక ఫార్మ్ ప్రోగ్రెస్ షో(వ్యవసాయ ప్రగతి ప్రదర్శన)కు రాష్ట్రవ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి ఆహ్వానం అందింది. ఈ నెల 29 నుంచి31వరకు అమెరికాలోని ఇల్లినాయిస్ డెకాటూర్ ఈ ప్రదర్శన జరగనుంది. ప్రపంచస్ధాయి వ్యవసాయ పరిశ్రమలో అత్యంత ఆధునాతన వ్యవసాయ ఉత్పత్తులు ,సాంకేతికతలపై ప్రదర్శన ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వంలో వ్యవసాయానికి మొదటి ప్రాధాన్యం పదేళ్ల కాలంలో తెలంగాణ వ్యవసాయ రంగ స్వరూపం సంపూర్ణంగా మారిపోయింది.
వ్యవసాయ రంగంలో కూలీల కొరత, నకిలీ విత్తనాలు, పెరుగుతున్న పెట్టుబడులు ప్రధాన సమస్యగా ఉన్నాయి. వాటిని అధిగమించేందుకు వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతిక, నాణ్యమైన అధిక దిగుబడిని ఇచ్చే విత్తనాలు, పెట్టుబడులను తగ్గించడం, రైతు పండించిన ఉత్పత్తులకు అధిక ధరలను కలిపించడం పై తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టింది. అత్యధిక శాతం జనాభాకు ఉపాధినిచ్చే వ్యవసాయాన్ని ఒక పరిశ్రమగా మార్చాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు.