- Advertisement -
మన తెలంగాణ/హైదరాబాద్ : క్రికెట్ రికార్డులను మించుతున్న చందంగా ప్రభుత్వ ఆసుపత్రులలో కాన్పులు కొనసాగుతున్నాయి. కాన్పులలో వనపర్తి ప్రభుత్వాసుపత్రి రికార్డ్ బ్రేక్ చేసింది. గతంలో ఒకే రోజు 28 కాన్పులు నమోదవ్వగా, ఆదివారం ఒకే రోజు 32 కాన్పులు నమోదై తన రికార్డును తానే అధిగమించినట్లైంది. ఆ 32 కాన్పులలో 16 నార్మల్, 16 సిజేరియన్ కాన్పులు జరిగాయి. రాష్ట్రంలో పెరిగిన వైద్య సదుపాయాలకు ఇది నిదర్శనం. వనపర్తి మాతా శిశు సంరక్షణ కేంద్రంలో ఒకే రోజు 32 కాన్పులపై సిబ్బంది, వైద్యులను ఒక ప్రకటనలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అభినందనలు తెలిపారు. ప్రజలకు మీరు అందిస్తున్న సేవలు అమూల్యమైనవని కొనియాడారు.
- Advertisement -