Monday, December 23, 2024

మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఔదార్యం

- Advertisement -
- Advertisement -
  • ఉన్నత చదువులకు పేద విద్యార్థికి రూ.50 వేల ఆర్థిక సాయం

పెద్దమందడి: నిరుపేద విద్యార్థికి ఉన్నత చదువుల కోసం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి రూ. 50 వేలు ఆర్థిక సాయం అందజేశారు. పెద్దమందడి మండలం దొడగుంటపల్లీ గ్రామానికి చెందిన నిరుపేద విద్యార్థి కొమ్ము నందన్ కుమార్ మహారాష్ట్ర యూనివర్సీటీలో ఉన్నత విద్య సీటు సాధించడం జరిగింది.

కానీ ఆర్థిక సమస్యల వల్ల యూనివర్సిటీ ఫీజు కట్టలేని పరిస్థితిలో ఉన్న విషయాన్ని జిల్లా బిఆర్‌ఎస్ నాయకులు పానుగంటి సురేష్ కుమార్ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. తక్షణమే స్పందించిన మంత్రి నిరుపేద విద్యార్థి కొమ్మునందకుమార్ ఉన్నత చదువుల కోసం రూ.50 వేల ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఆశీస్సులు అందజేసి ఉన్నత స్థాయికి ఎదికి సమాజానికి సేవచేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ నాయకులు కొమ్ము చెన్నయ్య, ఎస్‌సి సెల్ గ్రామ అధ్యక్షులు కొమ్ము తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News