మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వారి స్వగృహంలో కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలిపారు. అనంతరం రాజభవన్‌లో గవర్నర్ తమిళిసై, రాష్ట్ర స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను కలిసి పూలబొకే అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామని, పేదలకు ఆరు గ్యారెంటీలు అమలు చేసి ఇతర రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా చూపిస్తామన్నారు. మహాలక్ష్మి పథకం అమలు చేయడంతో ప్రజలను విశేష స్పందన వస్తుందని, అదే విధంగా ప్రజా పాలన ద్వారా పేదల సమస్యలపై దరఖాస్తులు తీసుకోవడం పట్ల రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.
గవర్నర్ తమిళిసైకి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి నూతన శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం ఉదయం తమ కార్యాలయంలోని ఉన్నతాధికారులతో కలిశారు. 2024 ఏడాదిలో రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.