Monday, December 23, 2024

గత ప్రభుత్వంపై కక్ష సాధింపు చర్యలు ఉండవు: మంత్రి శ్రీధర్ బాబు

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరిపైన కక్ష సాధింపులు ఉండవని రాష్ట్ర ఐటి శాఖ మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ప్రజాస్వామ్య ప్రభుత్వం నడుపుతాం, అందరిని కలుపుకుని ముందుకు వెళ్తామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. గత ప్రభుత్వ పాలసీలు ఉపయోగకరంగా ఉంటే మరింత ముందుకు తీసుకెళ్తామని మంత్రి వెల్లడించారు. దేశంలోనే తెలంగాణాని అన్ని రంగాల్లో నెంబర్ వన్ గా నిలపడానికి కృషి చేస్తామన్నారు. రాబోయే బడ్జెట్ లో అన్ని రంగాలకు ప్రాధాన్యమిస్తామని శ్రీధర్ బాబు తెలిపారు. యువతకు ఉద్యోగ కల్పన దిశగా చర్యలు చేపట్టామన్నారు. ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని సూచించారు. టిఎస్ పిఎస్ సి ఆధ్వర్యంలో ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని వెల్లడించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News