Monday, January 6, 2025

రాష్ట్రంలో బ్లాక్ చెయిన్ సిటీ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణలో బ్లాక్ చైన్ సిటీని ఏర్పాటు చేయబోతున్నట్లు రా ష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు వె ల్లడించారు. ఎక్కడ ఎంత విస్తీర్ణంలో ఏర్పాటు చే యాలనే అంశంపై ఇప్పటికే సంబంధిత పరిశ్రమలు, నిపుణులతో సంప్రదింపులు ప్రారంభించామన్నారు. శుక్రవారం మాదాపూర్ లో డ్రోన్ టెక్నాలజీ,రోబోటిక్స్ రంగంలో సుమారు1800 మందికి ఉపాధి కల్పిస్తున్న ‘సెంటిలియన్ నెట్ వర్క్ అండ్ హెచ్ సీ రోబోటిక్స్ ప్రైవేట్ లిమిటె డ్’ నూతన క్యాంపస్ ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. కొత్త సాంకేతికల ఆవిష్కరణ లో తెలంగాణను నంబర్ వన్ గా నిలిచేలా ప్ర ణాళికలు రూపొందించి అమలు చేస్తున్నామన్నారు. ఆయా రంగాల్లో తెలంగాణ యువతకు స్కిల్స్ యూనివర్సిటీ, పరిశ్రమల సహకారంతో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఫ్యూచర్ సిటీలో నిర్మించ తలపెట్టిన ఏఐ యూనివర్సిటీకి త్వర లో శంకుస్థాపన చేయబోతున్నామని,

ప్రత్యేకం గా క్వాంటం కంప్యూటింగ్‌లో సెంటర్ ఆఫ్ ఎ క్స్ లెన్స్‌ను ప్రారంభించబోతున్నామని వివరించారు. దేశంలో ఫ్రాంటియర్ టెక్నాలజీ హబ్ ను ఏర్పాటు చేసే యోచనలో కేంద్రం ఉందని, ఆ హబ్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలంటూ ఇప్పటికే కేంద్రాన్ని కోరామన్నారు. ఇ క్కడి అనుకూలతలను ప్రత్యేకంగా వివరించామ ని, ఈ విషయంలో కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. పౌర సేవలను చివరి వ్యక్తి వరకు సమర్థవంతంగా అందించాలనే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం ముందుకు వెళ్తుందని, ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు ఏఐ, బ్లాక్ చెయిన్ తదితర ఎమర్జింగ్ టెక్నాలజీస్ ను విరివిగా వినియోగించుకోబోతున్నామని తెలిపారు. ఇటీవలి కాలంలో కీలకంగా మారిన డ్రోన్ టెక్నాలజీపై తెలంగాణ యువతకు ప్రత్యేకంగా శిక్షణనిచ్చి వారికి ఉపాధి అవకాశాలను కల్పించేందుకు కసరత్తు చేస్తున్నామని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News