Thursday, December 19, 2024

రైతులను రెచ్చగొడుతున్నారు

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో ఆధిపత్యం కోసమే బిఆర్‌ఎస్, బిజెపి పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయని వ్యవసా య శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఆరోపించారు. దేశంలోనే రికార్డు స్థాయిలో ధాన్యం ఉత్పత్తి సాధించామని, 40లక్షల ఎకరాల్లో రైతు లు సన్న వడ్లను పండించారని తెలిపారు. 28 జి ల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు ఊపందుకున్నాయని, ఇప్పటి వరకు ఈ ఏడాది 9.5 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని చెప్పారు. బిఆర్‌ఎస్, బిజెపి పార్టీలు రైతులు ఇబ్బంది పడేలా వ్య వహరిస్తున్నాయన్నారు. రైతులు ఎలాంటి అపోహలు పడాల్పిన పని లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం పండిన ప్రతి గింజను కొనుగోలు చేస్తుందని, స న్న వడ్లకు బోనస్ ఇస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఐటి,

పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ధా న్యాన్ని సేకరిస్తున్నామని, పోటీపడి కళ్లాల్లోనే స న్నవడ్లు కొంటున్నారని, సన్న రకాలకు రూ. 500 బోనస్ చెల్లింపులు జరుగుతున్నాయని స్ప ష్టం చేశారు. సర్కార్ బోనస్ ప్రకటనతో సన్న వ డ్ల సాగు పెరిగిందని, రాష్ట్రంలో 7,400 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. దాదాపుగా ప్రతి గ్రామంలో కొనుగోలు సెంటర్ ఉందని, దేశంలో అతి ఎక్కువ ధాన్యాన్ని తెలంగాణలో పండిస్తున్నారన్నారు. ఇప్పటికే 9.58 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, ఓపెన్ మార్కెట్‌లో పెచ్చు ధర వస్తే అమ్ముకోమని రైతులకు చెప్పామన్నారు. పంట బీమాను కూడా మంత్రివర్గంలో చర్చించి ప్రీమియం కూ డా రాష్ట్ర ప్రభుత్వమే భరించేలా చర్యలు చేపడతామని వివరించారు. గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లకు కూడా సన్న బియ్యం సరఫరా చేస్తామన్నారు. తెలంగాణలో పండిన ప్రతి గింజ కొం టామని, రైతులకు

ఇన్ టైంలో చెల్లిస్తామని, పేదలకు సన్నబియ్యం ఇ వ్వాలనే ఆలోచనతో సన్న వడ్ల సాగును పెంచామన్నారు. నిధుల కొరత ఉన్నా ఇచ్చిన మాట ప్రకారం రూ.2లక్షలు రుణమాఫీ చేశామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రా ష్ట్రంలో అధికారం కోల్పోయిన వారు ఇటీవల ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ఆధిపత్యం కోసం బి ఆర్‌ఎస్, బిజెపి రాజకీయం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారమే ధాన్యం కోనుగోలు కొనసాగుతోందని అన్నారు. అయినా బీజేపీ రైతులను ఆగం చేసేందుకు ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. ధాన్యం, పత్తి కొనుగోళ్లలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూశామని పేర్కొన్నారు. ప్రభుత్వం తప్పు చేసిందని నిరూపిస్తే సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. కేబినెట్ సబ్ కమిటీ నివేదిక ఇచ్చిన వెంటనే రైతు భరోసా కూడా ఇస్తామని అన్నారు. పార్టీలు రైతుల మధ్య చిచ్చుపెట్టి శునకానందం పొందకూడదని ప్రతిపక్షాలకు మంత్రి తుమ్మల కౌంటర్ ఇచ్చారు. ప్రతిపక్ష పార్టీల్లో ఆధిపత్య ధోరణితో రైతులను బీఆర్‌ఎస్, బీజేపీ ఇబ్బందులు పడుతున్నారన్నారు.

పారదర్శకంగా పత్తి కొనుగోళ్లు : సీసీఐ కేంద్రాల్లో పారదర్శకంగా పత్తి కొనుగోళ్లు జరుగుతున్నాయని, గత ఏడాది ఇదే సమయానికి 24లక్షల మెట్రిక్ టన్నుల పత్తి పండిస్తే ఈ ఏడాది 25.50 మెట్రిక్ టన్నుల పత్తి పండించారని, వీటి కొనుగోలు కోసం గత ఏడాది కేవలం 86 సెంటర్లు ఏర్పాటు చేస్తే తమ ప్రభుత్వం 300 సెంటర్లు ఏర్పాటు చేసిందని మంత్రి తుమ్మల వివరించారు. అలాగే గత ఏడాది 15,859 మెట్రిక్ టన్నుల పత్తి కొనుగోలు చేయగా ఈ ఏడాది ఇప్పటివరకు 1,34,621 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. 2023లో 15,859 మంది రైతులు పత్తి పండించగా ప్రస్తుతం ఆ సంఖ్య 56,852కు చేరిందన్నారు. గతేడాది పత్తి కొనుగోలు విలువ రూ. 110 కోట్లు మాత్రమేనని, అదే ఈ ఏడాది అది రూ.987 కోట్లకు చేరిందని, గతేడాది రైతులకు రూ.8 కోట్లు మాత్రమే చెల్లిస్తే తమ ప్రభుత్వం ఇప్పటి వరకు 110 కోట్లు చెల్లించినట్లు స్పష్టం చేశారు.

బీఆర్‌ఎస్ నేతలు రైతులను రెచ్చగొడుతున్నారు : ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు

బీఆర్‌ఎస్ నేతలు రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు విమర్శించారు. సానుభూతి కోసం పదే పదే కేటీఆర్ అరెస్ట్ మాట ఎత్తుతున్నారని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. సచివాలయం లో మీడియాతో మాట్లాడుతూ లగచర్ల ఘటనపై పోలీసుల విచారణ కొనసాగుతోందని తెలిపారు. విచారణ పూర్తయ్యాక సూత్రధారులు ఎవరో, పాత్రధారులెవరో అన్ని విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తాయని అన్నారు. లగచర్లలో అధికారులపై హత్యాయత్నం జరిగిందని ఆయన ఆరోపించారు. రైతుల ముసుగులో కొందరు దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. కేటీఆర్ అరెస్ట్ కోసం తాము ఎలాంటి కుట్రలు చేయడం లేదని అన్నారు. సానుభూతి కోసం కేటీఆర్ పదేపదే అరెస్ట్ మాటను ఎత్తుతున్నారని ఎద్దేవా చేశారు.

ప్రజల మద్దతుతో ఏర్పడిన ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీఆర్‌ఎస్ బీజేపీ పార్టీలు కుట్రలు చేస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసిందన్నారు. ఆర్థిక కష్టాలున్నా రైతులకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నామన్నారు. రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం సన్నధాన్యానికి బోనస్ ఇస్తామని, రైతుల కష్టాలపై బీఆర్‌ఎస్ నేతలు మొసలికన్నీరు కారుస్తున్నారు. సన్న ధాన్యం సేకరించిన వారంలోపు బోనస్ చెల్లిస్తామని, రైతులకు మేలు చేసేందుకు ఏదైనా సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరామని స్పష్టం చేశారు. ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారని, 66.77 లక్షల ఎకరాల్లో 146 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అయ్యిందని, రైతులపై బిజేపీకి ప్రేమ ఉంటే తేమ శాతం నిబంధనలు మార్చాలని సూచించారు. సన్న బియ్యం పండించిన ప్రతి రైతుకు రూ.500 బోనస్ తప్పక ఇస్తామన్నారు. ఈ ఏడాది 146 మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి అయ్యిందని, రూ.33కోట్లు రైతుల ఖాతాల్లో బోనస్ నగదు ఆన్‌లైన్ ద్వారా జమ చేస్తున్నామని వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News