Thursday, December 26, 2024

వాస్తవాలను ప్రజలకు చెబుదాం.. మేడిగడ్డకు రండి: మంత్రి శ్రీధర్ బాబు

- Advertisement -
- Advertisement -

మేడిగడ్డ సందర్శనకు శాసనసభ్యులందరూ రావాలని ప్రభుత్వం తరుపున ఆహ్వానిస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. మంగళవారం అసెంబ్లీలో మంత్రి మాట్లాడుతూ.. పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యేలందరూ మేడిగడ్డ సందర్శనకు రావాలని కోరుతున్నట్లు చెప్పారు. విజులెన్స్ నివేదిక వచ్చిందని.. వాస్తవాలు ప్రజల ముందు ఉంచేందుకే మేడిగడ్డ ప్రదర్శన కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన చెప్పారు.

కాంగ్రెస్ హయాంలో కట్టిన అనేక ప్రాజెక్టులు 50ఏళ్లైనా.. ఇప్పటికీ దృఢంగా ఉన్నాయి.. కానీ గత ప్రభుత్వం కట్టిన కాళేశ్వరంలోని ప్రధాన ప్రాజెక్టు మేడగడ్డ నాలుగేళ్లకే కూలిపోయిందన్నారు. ఇది మేం చెబుతున్నది కాదని.. డ్యామ్ డిజైన్ లో లోపాలు ఉన్నట్లు విజులెన్స్ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిందని తెలిపారు. మీరందరికీ మేడిగడ్డలోని వాస్తవ విషయాలను చూపించాలని ప్రభుత్వం నిర్ణయించిందని.. మనమందరం కలిసి మేడిగడ్డను పరిశీలించి ప్రజలకు వాస్తవాలను చెబుదామని మంత్రి కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News