Wednesday, January 22, 2025

జోన్లవారీగా భవిష్యత్తులో నిర్మాణాలు జరిగేలా మాస్టర్ ప్లాన్ : మంత్రి శ్రీనివాస్ గౌడ్

- Advertisement -
- Advertisement -

 

మహబూబ్ నగర్ : మాస్టర్ ప్లాన్ లో కేటాయించిన జోన్లవారీగా భవిష్యత్తులో నిర్మాణాలు జరిగేలా మాస్టర్ ప్లాన్ ని రూపొందించాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు. బుధవారం రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ హైదరాబాదులోని తన క్యాంపు కార్యాలయంలో మహబూబ్ నగర్ పట్టణ ప్రతిపాదిత నూతన మాస్టర్ ప్లాన్ రూపకల్పనపై పురపాలక శాఖ, MUDA, HMDA Town ప్లానింగ్, ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ మహబూబ్ నగర్ పట్టణము శరవేగంగా హైదరాబాద్ మహానగరం కు అనుబంధంగా అభివృద్ధి చెందుతుందని, ఈ నేపథ్యంలో ప్రతిపాదిత మాస్టర్ ప్లాన్ లో ప్రభుత్వ స్థలాలు, దేవాలయ భూములు, వక్స్ స్థలాలు, చెరువు బఫర్ జోన్, హిల్స్ ఏరియాల పరిరక్షణకు ఈ ప్రతిపాదిత మాస్టర్ ప్లాన్ లో ప్రాముఖ్యత ఇవ్వాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

రోడ్లు, లింకు రోడ్స్, రింగ్ రోడ్డు ప్రజలకు ఉపయోగపడేలా మాస్టర్ ప్లాన్ లో పొందుపరచాలని మంత్రి పలు సూచనలు చేశారు. హైదరాబాద్ కు సమీపంగా నిర్మిస్తున్న ప్రతిపాదిత RRR కు , మహబూబ్ నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, మహబూబ్నగర్ మున్సిపల్ పరిధి లోని మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి కి పెద్దపీట వేయాలని మంత్రి ఆదేశించారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న మహబూబ్ నగర్ జిల్లాలో అదే స్థాయిలో మౌలిక సదుపాయాల కల్పన కు కృషి చేయాలని మంత్రి తెలిపారు. జిల్లాలో పరిశ్రమల, వాణిజ్య జోన్ ల ఏర్పాటు తో పాటు నూతనంగా ఏర్పాటు కానున్న జనావసాల నిర్మాణం కోసం భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ ను రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

ప్రతిపాదిత మాస్టర్ ప్లాన్ ను మంత్రి పరిశీలించారు. మాస్టర్ ప్లాన్ ను సాంకేతికంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పరిశీలించడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.ఈ సమీక్ష సమావేశం లో టౌన్ ప్లానింగ్ జాయింట్ డైరెక్టర్ D. రమేష్ బాబు, డిప్యూటీ డైరెక్టర్ టౌన్ ప్లానింగ్ జగన్మోహన్, MUDA డిప్యూటీ డైరెక్టర్ MA మాజిద్, HMDA చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ రవీందర్ రెడ్డి , రమేష్ బాబు HMDA చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ లు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News