Thursday, December 26, 2024

దేశ వ్యాప్తంగా ప్రజల మద్దతు పెరగాలి : మంత్రి శ్రీనివాస్ గౌడ్

- Advertisement -
- Advertisement -

 

మంత్రి శ్రీనివాస్ గౌడ్ వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో కొలువై ఉన్న కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని ఈ రోజు వేకువజామున దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రొహిబిషన్ & ఎక్సైజ్, క్రీడా, పర్యాటక , సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల ప్రజలతో పాటు భారత దేశ ప్రజలందరూ బాగుండాలని కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ని కోరుకున్నట్లు తెలిపారు.

శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం రాష్ట్ర ముఖ్యమంత్రి కెసీఆర్ కి నిరంతరం ఉండాలని, వారి నాయకత్వం లో తెలంగాణ రాష్ట్రం లో అమలు అవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా విస్తరించేలా, BRS పార్టీ కి దేశ వ్యాప్తంగా ప్రజల మద్దతు పెరగాలని వెంకటేశ్వర స్వామి ని కోరుకుంటున్నట్లు మంత్రి వెల్లడించారు.

మహబూబ్ నగర్ ప్రజలు సుఖశాంతులతో, శాంతి సౌభాగ్యాలతో, ఆయురారోగ్యాలతో, పాడిపంటలతో ఆనందంగా జీవించాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. శ్రీనివాస్ గౌడ్ గారి వెంట శ్రీవారిని దర్శించుకున్న వారిలో మహబూబ్ నగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, MUDA చైర్మన్ గంజి వెంకన్న ముదిరాజ్, PACs చైర్మన్ జూపల్లి భాస్కరరావు, మాజీ AMC చైర్మన్ చేరుకుపల్లి రాజేశ్వర్,BRS పార్టీ నాయకులు కృష్ణమోహన్, శివరాజ్, సత్యనారాయణ, మహబూబ్ నగర్ నియోజకవర్గ ఇతర ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News