Saturday, November 16, 2024

రాష్ట్రంలో అత్యున్నత క్రీడా పాలసీని రూపొందిస్తున్నాం: శ్రీనివాస్ గౌడ్

- Advertisement -
- Advertisement -

Minister Srinivas Goud appreciate Swimmer Goli Shyamala

హైదరాబాద్: తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారని రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సోమవారం హైదరాబాద్ లోని తన క్యాంప్ కార్యాలయంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, అంతర్జాతీయ స్విమ్మింగ్ క్రీడాకారిణి గోలి శ్యామలను అభినందించారు. గోలి శ్యామల ప్రపంచంలోని సప్త సముద్రాలను ఈది తెలంగాణ రాష్ట్రానికి, మన దేశానికి పేరు ప్రతిష్టలు తీసుకరావలనే లక్ష్యంతో ఎంతో ప్రమాదకరమైన, కోల్డ్ వాటర్ తో కూడిన లోతైన ప్రాంతమైన కేటాలినా ఐలాండ్ నుండి లాస్ ఏంజెల్స్ వరకు(సుమారు 36 కిలోమీటర్లు) జరిగిన స్విమ్మింగ్ అడ్వెంచర్స్ ను పూర్తి చేసి చరిత్ర సృష్టించిన తొలి తెలుగు మహిళగా నిలిచినందుకు మంత్రి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో అత్యున్నత క్రీడా పాలసీని రూపొందిస్తున్నామన్నారు. గోలి శ్యామల అంతర్జాతీయ స్థాయి వేదికలపై స్విమ్మింగ్ విభాగంలో రాణించి రాష్ట్రానికి, దేశానికి పేరు ప్రఖ్యాతులు తీసుకరావడం సంతోషంగా ఉందన్నారు. గతంలో భారత్-శ్రీలంక మధ్య హిందు మహా సముద్రంలో ఉన్న పాక్ జల సంధి(30 కిలోమీటర్లు)ని ఈదిన రెండో మహిళగా చరిత్ర సృష్టించారని మంత్రి తెలిపారు.

Minister Srinivas Goud appreciate Swimmer Goli Shyamala

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News