Friday, December 20, 2024

నిష్క అగర్వాల్ ను అభినందించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : జిమ్నాస్టిక్స్ క్రీడాకారిణి నిష్క అగర్వాల్ ను రాష్ట్ర క్రీడలు, పర్యాటక సాంస్కృతిక శాక మంత్రి డాక్టర్ . వి. శ్రీనివాస్ గౌడ్ అభినందించారు. ఇటీవల కేరళ రాజధాని తిరువనంతపురం లోని జమ్మీ జార్జ్ ఇండోర్ స్టేడియంలో మొన్న డిసెంబర్ 30 నుండి జనవరి 2వ తేదీ వరకు జూనియర్ ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ నేషనల్ ఛాంపియన్‌షిప్ 2022 23 లో పోటీలు జరిగాయి. ఇందులో హైదరాబాద్‌కు చెందిన కుమారి నిష్క అగర్వాల్ అందులో ఆల్ రౌండ్ ఛాంపియన్‌షిప్ తో పాటు బ్యాలెన్స్ డ్రీమ్ విభాగంలో గోల్డ్ మెడల్ , ఇక ఫ్లోర్ ఎక్సర్‌సైజ్ విభాగంలో బ్రాంచ్ మెడల్ సాధించారు. ఈ సందర్భంగా కుమారి నిష్క అగర్వాల్ రాష్ట్ర మంత్రి డాక్టర్ . వి. శ్రీనివాస్ గౌడ్‌ను హైదరాబాద్‌లోని తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం నాడు కలిసిన సందర్బంగా మంత్రి డాక్టర్ శ్రీనివాస్ గౌడ్ వారిని అభినందించారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత క్రీడల అభివృద్ధికి ముఖ్యమంత్రి కెసిఆర్ సహకారంతో అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్రంలో దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా క్రీడాకారులకు 2 శాతం ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు, ఉన్నత విద్య కోసం 5 శాతం రిజర్వేషన్లను కల్పిస్తున్నామన్నారు. దేశంలో అత్యుత్తమ క్రీడా పాలసీని తెలంగాణలో రూపొందించుకుంటున్నామని ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో పథకాలు సాధిస్తున్న క్రీడాకారులకు నగదు ప్రొత్సాహకాలు అందించి వారిని ప్రొత్రహిస్తున్నామన్నారు. జిమ్నాస్టిక్స్ లో రాణిస్తున్న నిష్క అగర్వాల్‌ను ఈ సందర్భంగా అభినందించారు. రాష్ట్రంలో జిమ్నాస్టిక్స్ క్రీడను ప్రొత్సహిస్తున్నామని ఈ సందర్బంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ ఒలంపిక్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు ప్రేమ్ రాజ్, ఇండియన్ జిమ్నాస్టిక్స్ టీమ్ కోచ్ మనోజ్ రాణి, ద తెలంగాణ జిమ్నాస్టిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జిఎస్ మహేశ్ జాయింట్ సెక్రటరీ విజయ్ పాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News